సజ్జల పై గురి పెట్టిన పవన్ - తాజా నిర్ణయంతో..!!
ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. వైసీపీ నేతల పైన ఉన్న ఆరోపణల పై కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసింది. తాజాగా కడప జిల్లాల సజ్జల కుటుంబం ఎస్టేట్ లో అటవీ, డీకేటీ భూములు ఉన్నారనే ఆరోపణలు తెర మీదకు వచ్చాయి. ఇప్పుడు వీటి పైన డిప్యూటీ సీఎం పవన్ ఆరా తీసారు. సజ్జల కుటుంబ ఎస్టేట్‌లోని భూముల్లో అటవీ భూములెన్నో నివేదిక ఇవ్వాలని కడప కలెక్టర్‌ను ఆదేశించారు. దీంతో, ఇప్పుడు కలెక్టర్ ఇచ్చే నివేదిక ఈ వ్యవహారంలో కీలకం కానుంది.
వైసీపీ ముఖ్య నేత సజ్జల కడప జిల్లాలోని సీకేదిన్నె మండలం సుబాలిగిడికి గ్రామం సమీపంలో సుమారు 200 ఎకరాల్లో ఎస్టేట్ ఏర్పాటు చేసారు. సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడు సజ్జల దివాకర్ రెడ్డి కుమారుడైన సందీప్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు బినామీ పేర్లతో వందల భారీగా పట్టా భూములు, డీకేటీ భూములు కొనుగోలు చేశారు. ఇందులో కొన్ని అటవీ భూములు, డీకేటీ భూము లను కబ్జా చేశారనే ఆరోపణలు తెర మీదకు వచ్చాయి. సర్వేనంబర్ 1629లో 40 ఎకరాల వరకు అటవీ భూముల పైన ఫిర్యాదులు ఉన్నాయి. ఈ భూముల వద్ద కంచె, పెద్దపెద్ద గేట్లు పెట్టి లోపలికి ఎవర్నీ అనుమతించడం లేదని చెబుతున్నారు.

అదే విధంగా ప్రధాన గేటుకు ఎదురుగా సర్వేనంబర్ 1612లో 5 ఎకరాల 14 సెంట్ల చుక్కల భూమి ఉంది. తమ భూములను సజ్జల ఎస్టేట్‌లో కలిపేసుకున్నారని, నోరెత్తితే చంపేస్తామని బెదిరించినట్లు రాజానాయక్ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు గతంలో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహా రంపై మూడు రోజుల నుంచి రెవిన్యూ, అటవీశాఖ అధికారులు పోలీసు బలగాలతో వెళ్లి సర్వే చేస్తున్నారు. దీంతో, ఈ వ్యవహారం పైన పవన్ స్పందించారు. విచారణ జరపాలని నిర్దేశించారు. ఏ మేరకు అటవీ భూములు అన్యాక్రాంతం అయ్యాయో గుర్తించి.. ఎవరి ఆధీనంలో ఉన్నాయో.. పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. అధికారులు ఈ రోజు నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. దీంతో, ఇప్పుడు సజ్జల విషయంలో ఎలాంటి నిర్ణయం ఉంటుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications