వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ వల్ల కదలిక: ఉద్ధానం కిడ్నీ సమస్యకు కారణాలివీ!

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఉద్ధానం కిడ్నీ వ్యాధుల నియంత్రణపై జనసేన నిర్వహించిన మెడికల్ సింపిజియంకు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆదివారం హాజరయ్యారు.

కిడ్నీ సమస్యలకు కారణాలు పవన్‌కు వివరించారు

కిడ్నీ సమస్యలకు కారణాలు పవన్‌కు వివరించారు

ఈ సందర్భంగా ఆయన వైద్యులు, హార్వార్డ్ బృందం నిపుణులతో మాట్లాడారు. వైద్యులు ఉద్దానంలో క్షేత్రస్థాయి పరిస్థితులను పవన్‌కు వివరించారు. ఉద్ధానం కిడ్నీ సమస్యలకు పలు కారణాలను వారు పవన్‌కు వెల్లడించారు.

తక్కువ నీరు తాగడం, సిలికా నీరు తాగడం

తక్కువ నీరు తాగడం, సిలికా నీరు తాగడం

తక్కువ మంచినీరు తాగే అలవాటు ఉండటం ఈ వ్యాధికి కారణమని పవన్ కళ్యాణ్‌కు చెప్పారు. జన్యుపరమైన సమస్యలు, పౌష్టికాహారలోపం కూడా కారణమని తెలిపారు. సిలికా మినరల్ కలిపిన నీటిని తీసుకోవడం కూడా కిడ్నీ వ్యాధులకు కారణమని చెప్పారు.

ఈ సమస్య సౌత్ అమెరికా, యూరోప్‌లోని కొన్ని దేశాల్లో

ఈ సమస్య సౌత్ అమెరికా, యూరోప్‌లోని కొన్ని దేశాల్లో

పవన్ కళ్యాణ్ కదిలిన తీరుతో ఉద్దానం ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం లభించిందని సింపోజియంలో పాల్గొన్న నిపుణులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సమస్య కేవలం ఉద్దానంలోనే లేదని, ఉద్దానంతోపాటు సౌత్ అమెరికా, యూరోప్ లోని కొన్ని దేశాల్లో ఉందని చెప్పారు.

ప్రపంచస్థాయి పరిశోధన కేంద్రం

ప్రపంచస్థాయి పరిశోధన కేంద్రం

అయితే దీని నివారణకు పరిశోధనలు జరుగుతున్నాయని వారు తెలిపారు. ఉధ్దానంలో ప్రపంచ స్థాయి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉద్దానం కిడ్నీ బాధితుల రిపోర్టులు అంతర్జాతీయ పరిశోధకులతో పంచుకుంటే మరింత మంచి ఫలితాలు సాధించవచ్చని చెప్పారు.

English summary
Pawan Kalyan participates in Jana Sena symposium.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X