పాలకుల ప్రజావ్యతిరేక నిర్ణయాలు జనసేనకు లాభం: పంచాంగ శ్రవణం
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి ప్రాంతంలో రైతులతో కలిసి ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఉద్దండరాయునిపాలెంలోని ఎస్సీ కాలనీలో ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పండితులు పంచాంగ శ్రవణం వినిపించారు. ప్రస్తుత పాలకులు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని, అవి జనసేనకు అనుకూలంగా మారుతాయని జోస్యం చెప్పారు. మంత్రుల మధ్య వైరం ఏర్పడటం వల్ల పాలన కుంటుపడుతుందన్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎత్తుపల్లాలు వస్తాయన్నారు. ప్రజలకు నాయకుడు పవన్ అన్నారు. జనసేన నాయకత్వం వల్ల ప్రజలకు లాభం కలుగుతుందన్నారు. కాగా పవన్ కళ్యాణ్ తుళ్లూరు మండలంలోని ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెంలలో లంక భూములను పరిశీలించారు.












Click it and Unblock the Notifications