• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వివేకా హత్య కేసును జగన్ వదిలేస్తాడా?: వైసీపీకి పవన్ సవాల్..10 మంది బొలిశెట్టిలు ఉంటే సీన్ మరోలా..

|

''సమాజం ఇంతగా కుళ్లిపోయిన తర్వాత కూడా డబ్బులు లేకుండా రాజకీయాలు చేయగలమా? అని అందరికీ సందేహాలుండొచ్చు. దీనికి సంబంధించి ఇటీవలే చక్కటి ఉదాహరణ చూశాం. జనసేనతో కలిసి పనిచేస్తూ, ఎంతో బలంగా ఉన్న బీజేపీని ఢిల్లీలో చిత్తుగా ఓడించిన ఘనత ఆమ్ ఆద్మీ పార్టీకి దక్కింది. కేజ్రీవాల్ డబ్బులిచ్చి ఓటర్లను కొనలేదు. డబ్బుల్ని కూడా ప్రభావితం చేయగలిగిన ఐడియాలజీతోనే ఆప్ గెలుపు సాధించింది. ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో జనసేన కూడా అలాంటి వ్యూహంతోనే ముందుకు తీసుకెళదాం''అని జనసేనాని పవన్ కల్యాణ్ పార్టీ నేతలు, కార్యకర్తలకు నిర్దేశించారు. ఆదివారం తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన పార్టీ వ్యక్తులతో సమావేశమైన ఆయన ఈ మేరకు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ ప్రసంగం ఆయన మాటల్లోనే..

ఉండవల్లి అరుణ్ చెప్పింది నిజం.. అందుకే నా ఫ్యాన్స్ జనసేనకు ఓటేయలేదు: పవన్ కల్యాణ్

బొలిశెట్టి లాంటోళ్లు ఓ 10 మంది ఉండుంటే..

బొలిశెట్టి లాంటోళ్లు ఓ 10 మంది ఉండుంటే..

‘‘గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అవలీలగా గెలవాల్సిన తాడేపల్లిగూడెంలోనూ ఓడిపోయాం. పరిస్థితులు ఏవైనప్పటికీ కార్యకర్తలు పార్టీతో కలిసి నడుస్తున్నందుకు ధన్యవాదాలు. బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి నాయకులు ఇంకో 10 మంది ఉండుంటే ఈపాటికి జనసేన జెండా రెపరెపలాడేది. ఆయన కూడా నాలాగే వాస్తవాలు మాట్లాడుతారు. ఆయనగానీ సంవత్సరం ముందుగా చేరి ఉంటే.. ఈజీగా గెలిచేవారు. ఎన్నికల్లో డబ్బులు పెడితే గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. సమస్య పవన్ కల్యాణ్ లోనో లేదా జనసేన పార్టీ నాయకుల్లోనో లేదు. ఎక్కువ శాతం మంది ప్రజలు డబ్బుల ప్రభావానికి లోనయ్యారు. బద్ధకంతో ఓట్లేయడానికి కూడా ముందుకు రావట్లేదు.

కోడికత్తి కుచ్చిన యువకుణ్ని వదిలేస్తారా?

కోడికత్తి కుచ్చిన యువకుణ్ని వదిలేస్తారా?

రాజకీయాల్లో మెత్తగా ఉంటే కుదరదు. తిట్లు విమర్శలు ఉంటాయి. జనసేన నుంచి ఎమ్మెల్యే గా గెలిచిన రాపాక ఇప్పుడు పార్టీపైనే విమర్శలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అదే వ్యక్తి 2014లో వైసీపీ టికెట్ ఇప్పించమని నా దగ్గరికొచ్చి వేడుకున్నాడు. స్థాయిదాటి తిడితే ఊరుకునే సమస్యేలేదు. సుగాలి ప్రీతి విషయంలో ఇప్పుడెందుకు మాట్లాడుతున్నానని వైసీపీ నేతలు నన్ను తిడుతున్నారు. వాళ్లకు నేనిచ్చే సమాధానమిదే.. జగన్ రెడ్డి కూడా సీబీఐ కోర్టుకు వెళ్లి.. అవి పదేళ్ల కిందటి కేసులు కావట్టి కొట్టేయమని అడుగుతారా? వైఎస్ వివేకా చనిపోయి ఏడాదైంది కాబట్టి కేసును వదిలేస్తారా? లేదంటే జగన్ కు కోడికత్తి కుచ్చిన అబ్బాయిని వదిలేస్తామంటారా? ఇదేనా రాజకీయం?

2వేలకు ఓటు అమ్ముకున్న ప్రజలకు.. 2వేల కోట్లు తిన్న చంద్రబాబు పీఏను ప్రశ్నించే హక్కులేదు: పవన్ కల్యాణ్

అసలు కులం అంటే ఏంటో తెలుసా?

అసలు కులం అంటే ఏంటో తెలుసా?

కులాలు, మతాలుగా దేశం విచ్ఛితమైపోతుంటే చూడలేక దాన్ని కాపాడటానికే నేను జనసేన పార్టీ పెట్టాను. ఇప్పటికీ కులాల వారీగా ఓట్లను లెక్కలేసుకునే స్థాయిలో పార్టీలు ఉండటం దారుణం. తాడేపల్లిగూడెంలో ఎస్సీ కులాలకు చెందినవాళ్లెవరూ వైసీపీవైపు లేరన్నది నిజమే కావొచ్చు. అయితే నన్ను మాత్రం కులాల చట్రంలో ఇరికించొద్దు. కులాల్ని ప్రస్తావించడం నాకు నచ్చదు. కులం అనేది ఒక ట్రైబల్‌ఇన్‌స్టింక్ట్ మాత్రమే. ఆఫ్రికాలాంటి దేశాల్లో ట్రైబ్స్ ఉంటాయి. ప్రతి 100 కిలోమీటర్ల పరిధిలోనే 20, 30 జాతులుంటాయి. వాళ్లలో చాలా గొడవలుంటాయి. మన దేశానికి వచ్చేటప్పటికి.. వృత్తుల జీవనవిధానం కాస్తా కులాలుగా మారాయి. రెండు కులల మధ్య గొడవ రాజధాని విచ్ఛిన్నానికి దారితీసిందన్న ఉండవల్లి అరుణ్ కుమార్ మాటపై చాలా లోతైన చర్చ, విశ్లేషణ జరగాలి.

సావర్కర్‌తో పోల్చుకుంటే మనమెంత?

సావర్కర్‌తో పోల్చుకుంటే మనమెంత?

జగన్ రెడ్డి లాగా నాకు కంపెనీలు, మైన్స్ లేవు. గ్రంధి శ్రీనివాస్ లాగా ఆక్వా వ్యాపారాలు లేవు. నటన ఒక్కటే నా ఆదాయ మార్గం కాబట్టి మళ్లీ సినిమాల్లోకి వెళ్లాను. నిజం చెప్పాలంటే ఇవాళ మనం చేస్తున్న త్యాగాలు చాలా చిన్నవి. వీర్ సావర్కర్ లాంటి మహాయోధులు.. బ్రిటిష్ వాళ్ల చేతుల్లో దారుణంగా దెబ్బలుతిని, ఒళ్లంతా సెప్టిక్ అయిన స్థితిలోనూ దేశం కోసం పోరాడిన తీరు చాలా గొప్పది. అదీ త్యాగమంటే. కుళ్లిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చడానికే జనసేన స్థాపించాను. టీనేజ్ లో ఉన్నప్పుడే నేను సమాజంపై బాధ్యత గుర్తించాను. రాజకీయాలు నాకు రిటైర్మెంట్ ప్లాన్ కాదు. సినిమాల్లో ఉన్నప్పుడు కూడా నేను నిజాయితీగా ఉన్నాను. మూవీ ఫ్లాప్ అయితే నిర్మాతలకు అండగానే ఉన్నాను తప్ప గాలికొదిలెయ్యలేదు.

కేరళ మంత్రి మెచ్చుకోలు..

కేరళ మంత్రి మెచ్చుకోలు..

ఈ మధ్యే కేరళకు చెందిన ఓ యువ మంత్రి నన్ను కలిశారు. జనసేన పార్టీ ఏవైతే సిద్ధాంతాలు, ఆశయాలు చెబుతున్నదో.. అచ్చంగా అవి కేరళలో అమలవుతున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో జనసేన ఇంకా అధికారంలోకి రాలేదని బాధపడొద్దని, సిద్ధాంత పరంగా జనసేన సరైన దారిలోనే నడుస్తోందని ఆయన మెచ్చకున్నారు. ఇవాళ ఏపీలో ప్రజలకు కష్టం వస్తే జనసేన ఆఫీసులకు వస్తున్నారేగానీ.. ఏ వైసీపీ నేత దగ్గరికి వెళ్లడంలేదు. అంటే జనసే ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజల్లో మాత్రం విజయం సాధించింది''అని పవన్ కల్యాణ్ వివరించారు.

English summary
jana sena chief pawan kalyan praises arvind kejriwal for defeating bjp in delhi elections. he said, jana sena party will follow aap model politics in andhra pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X