పశ్చిమగోదావరి జిల్లాలో కౌలురైతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ పరామర్శ.. ఆర్ధికసాయం అందిస్తూ భరోసా!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్రను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు భరోసా కల్పించడానికి రైతు భరోసా యాత్ర నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్, బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తానని ఉగాది పండుగ నాడు ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర


జనసేన కౌలు రైతు భరోసా యాత్ర కోసం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ కు పార్టీ నాయకులు, శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఏలూరు శివారులో ఉన్న కలపర్రు టోల్ గేట్ వద్దకు వేల సంఖ్యలో తరలివచ్చిన జనసైనికులు, అభిమానులు జయ జయ ధ్వానాల నడుమ భారీ గజమాలతో సత్కరించారు. రైతన్నల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన పార్టీ నాయకులు, అభిమానులు కౌలు రైతు భరోసా యాత్ర లో పాల్గొంటున్నారు.

ఏలూరు జిల్లాలో బాధిత కుటుంబానికి లక్ష రూపాయల ఆర్ధిక సాయం అందించిన పవన్ కళ్యాణ్


కౌలు రైతు భరోసా యాత్ర లో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి వారికి పార్టీ తరఫున ఆర్థిక సహాయాన్ని అందించి, రైతుల కుటుంబాలకు తాము అండగా ఉంటామని చెబుతున్నారు. శనివారం నాడు ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయి గ్రామానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు మల్లికార్జున కుటుంబాన్ని పరామర్శించి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ధర్మాజీగూడెంలోనూ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబానికి పవన్ పరామర్శ


మల్లికార్జున ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను, ప్రస్తుతం సదరు రైతు కుటుంబ పరిస్థితులను కుటుంబ సభ్యులను అడిగి పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు. ఎవరు అధైర్య పడొద్దని, జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాలకు తెలిపారు. అనంతరం ధర్మాజీగూడెంలో కౌలురైతు దాసరి రాజారావు కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించిన జనసేన దాసరి రాజారావు ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకొని వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.

భాదిత కుటుంబాల పరిస్థితి తెలుసుకుంటున్న జనసేనాని


లింగపాలెం లోను బాధిత కుటుంబాలను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఆపై అక్కడినుండి మళ్లీ ధర్మాజీగూడెం మీదుగా చింతలపూడి కి వెళ్లే మార్గంలో పలు గ్రామాలలో బాధిత కౌలు రైతుల కుటుంబాలను పరామర్శిస్తున్నారు. మట్టం గూడెం లో కౌలు రైతు కాకొల్లు బాబురావు గారి కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం అందించిన పవన్ కళ్యాణ్ వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

ఏలూరు, భీమవరం జిల్లాలలో అప్పుల బాధతో 41 మంది కౌలు రైతులు ఆత్మహత్య

ఏలూరు, భీమవరం జిల్లాలలో అప్పుల బాధతో 41 మంది కౌలు రైతులు ఆత్మహత్య


ఒక్క ఏలూరు, భీమవరం జిల్లాలలో అప్పులబాధతో 41 మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇందులో చింతలపూడి నియోజకవర్గం లో 31 కుటుంబాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతో పవన్ కళ్యాణ్ ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తూ, వారికి తానున్నానని భరోసా ఇస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+