పిఠాపురంలో పవన్ కొన్న స్థలం రేటు ఎంత - కొత్త స్కెచ్ సిద్దం..!!
పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తనను గెలిపించిన పిఠాపురంలోనే ఇక నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. పిఠాపురం కేంద్రంగా పవన్ భారీ స్కెచ్ తో సిద్దమయ్యారు. భవిష్యత్ రాజకీయం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ముందుగా తాను పిఠాపురం లోకల్ అని చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా పిఠాపురంలో మూడు ఎకరాల స్థలం కొనుగోలు చేసారు. రిజిస్ట్రేషన్ పూర్తి చేసి తదుపరి కార్యాచరణ ప్రారంభించనున్నారు.
పవన్ నిర్ణయాలు
పవన్ కల్యాణ్ తన దీర్ఘకాలిక రాజకీయ ప్రయాణం పైన ఫోకస్ చేసారు. పక్కా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. డిప్యూటీ సీఎం అయిన తరువాత పవన్ వ్యవహార శైలిలో..ప్రణాళికల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. తాజాగా పవన్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో మూడు రోజుల పాటు పర్యటించారు. ఇదే సమయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని 4 అంతస్థుల భవనం కొనుగోలు చేసిన పవన్.. దాన్ని కార్యాలయంగా వాడుకుంటున్నారు.

పిఠాపురం కేంద్రంగా
పిఠాపురంలో సొంతిళ్లు కట్టుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా బుధవారం స్థలం కొని, రిజిస్ట్రేషన్ చేయించారు. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, 2.08 ఎకరాల రెండు బిట్లు తీసుకున్నారు. ఇందులో రెండు ఎకరాల స్థలంలో క్యాంపు ఆఫీసు, మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకుని, పిఠాపురంలో నివసిస్తానని పవన్ నియోజకవర్గ ప్రజలకు మాట ఇచ్చారు. ప్రస్తుతం పిఠాపురంలో ఎకరం భూమి విలువ రూ.16-20 లక్షల మధ్య ఉంది. వీటితోపాటు ఇంకో 10 -15 ఎకరాల తోటలు కొనేందుకు పవన్ సిద్ధమవుతున్నారు.
కొత్త ప్రణాళికలు
నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఇప్పటికే అయిదుగురు సహాయకులను నియమించారు. తాను తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తానని, ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పిఠాపురం ప్రజలు ఇచ్చిన విజయం.. దేశ రాజకీయాల్లో మాట్లాడుకునేలా చేసిందన్నారు పవన్. ఒక్కడి కోసం ఇంతటి ఘన విజయం అందించిన ప్రజలకు చేతులెత్తి నమస్కరించారు. ఎన్నికల్లో 100 శాతం స్ట్రయిక్ రేటు దేశంలో ఇప్పటివరకు ఎవరూ చూడలేదన్నారు పవన్ కల్యాణ్. ఎంతో ధైర్యం, బలం ఇచ్చిన పిఠాపురం నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించారు.












Click it and Unblock the Notifications