వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయసాయిరెడ్డికి పవన్ ఘాటైన పంచ్..! అధికారంలోకి రాగానే పునీతులయ్యారా అంటూ ప్రశ్న..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : ఏపి రాజకీయాల్లో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లేవనెత్తిన ఇసుక ఉద్యమంపై అధికార పార్టీ నేతలు భగ్గుంటున్నారు. ఇసుక కొరతతో ఉపాది లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పతున్నారంటూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు విశాఖలో పవన్ కళ్యాణ్ చేపట్టిన లాంగ్ మార్చ్ పట్ల వైసీపి ఎంపి విజయచేసిన వ్యాఖ్యలకు జనసేన అతదినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. జైలుకెళ్లొచ్చిన మీరు, అధికారంలోకి రాగానే పునీతులయ్యారా అంటూ ప్రశ్నించారు పవన్. హద్దులు దాటితే ఎలా ప్రతిస్పందించాలో మాకూ తెలుసని విజయసాయి రెడ్డిని హెచ్చరించారు గబ్బర్ సింగ్..!

విజయసాయి రెడ్డి పై విరుచుకుపడ్డ పవన్.. విలువల గురించి మాట్లాదే అర్హత లేదన్న గబ్బర్ సింగ్..

విజయసాయి రెడ్డి పై విరుచుకుపడ్డ పవన్.. విలువల గురించి మాట్లాదే అర్హత లేదన్న గబ్బర్ సింగ్..

విశాఖ పట్టణం కేంద్రంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భవన నిర్మాణ కార్మికుల కోసం తలపెట్టిన లాంగ్ మార్చ్ విజయవంతం అయ్యింది. పవన్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పెద్ద ఎత్తున జనం కదిలి వచ్చారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై స్పందించిన పవన్ కళ్యాణ్, అందరినీ టార్గెట్ చేస్తూ అన్నిటికీ కౌంటర్లు వేశారు. తనను తరచూ విమర్శించే విజయసాయిరెడ్డి లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చాసారు గబ్బర్ సింగ్. ఎంపీ గా విజయసాయిరెడ్డి ఢిల్లీ లో చేసే కార్యకలాపాలన్నీ తనకు తెలుసని, చీకటి సమావేశాలకు సంబంధిచిన చిట్టా తనకు తెలుసని, ఢిల్లలో ఎవరెవరిని కలుస్తారో కూడా తనకు తెలుసంటూ విమర్శలు గుప్పించారు పవన్ కళ్యాణ్.

వపన్ లక్ష్యంగా సాయిరెడ్డి పోస్టులు.. సమాధానం ఇచ్చిన జన సేనాని..

వపన్ లక్ష్యంగా సాయిరెడ్డి పోస్టులు.. సమాధానం ఇచ్చిన జన సేనాని..

ఐతే గత కొన్ని రోజులుగా చంద్రబాబు, లోకేష్ ను టార్గెట్ చేసే విజయసాయిరెడ్డి, తాజాగా పవన్ కళ్యాణ్ లక్ష్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ లేవనెత్తిన సమస్య గురించి స్పందించకుండా, అతన్ని హేళన చేసే కోణంలో విమర్శలు చేస్తున్నారు. దత్తపుత్రుడు, డి.ఎన్.ఏ, బి టీం అంటూ చౌక బారు ఆరోపణలు చేస్తున్నారు. ఎంత సేపు తెలుగుదేశం అనుబంధంగా చూపించి ఆ పార్టీని ఎదగకుండా చేయాలనే తాపత్రయంతో పనిచేస్తున్నారు సాయి రెడ్డి. వీటన్నింటిని సునిశితంగా గమనించిన పవన్ సాయిరెడ్డిపై గట్టిగానే స్పందించారు.

జైలుకెళ్లొచ్చి నీతులు చెప్తారా.. సమస్య మీద స్పందించాలన్న కాటమరాయుడు..

జైలుకెళ్లొచ్చి నీతులు చెప్తారా.. సమస్య మీద స్పందించాలన్న కాటమరాయుడు..

అంతే కాకుండా విజయసాయి రెడ్డి గారు ఇష్టానుసారంగా మాట్లాడతున్నారని, పవన్ కళ్యాణ్​​ అనే వాడు ఫ్యాక్షన్ రాజకీయాలకు భయపడడని జనసేనాని స్పష్టం చేసారు. జీవితంలో ఇలాంటి సంఘటనలు చాలా చూశానని అన్నారు. విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యులు, రాజ్య సభకు దేశానికి ఉపయోగపడే వ్యక్తులు వెళ్తారని, తెలుగు వాళ్ల దురదృష్టం కొద్దీ సూట్ కేసు కంపెనీలు నడిపే విజయ సాయి రెడ్డి రాజ్యసభకు వెళ్లారని, అలాంటి సాయి రెడ్డి కూడా తనను విమర్శిస్తే దానికి కూడా సమాధానం చెప్పుకునే పరిస్థితి ఈ దేశంలో వచ్చిందంటూ రెచ్చిపోయారు పవన్ కళ్యాణ్.

ఓడిపోతే ప్రజా సమస్యలపై స్పందించ కూడదా..! సూటిగా ప్రశ్నించిన పవన్..!!

ఓడిపోతే ప్రజా సమస్యలపై స్పందించ కూడదా..! సూటిగా ప్రశ్నించిన పవన్..!!

రాజకీయాల్లో ఓడిపోయానని, మాట్లాడడానికి తనకు నైతిక విలువ లేదని విజయ సాయి రెడ్డి అంటున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అంబెడ్కర్ ఓడిపోలేదా? కాన్షిరాం ఓడిపోలేదా? అని పవన్ సాయి రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. జైలుకి వెళ్లి వచ్చిన విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులు కూడా తన నైతిక విలువ గురించి మాట్లాడుతున్నారంటే ఎంత సిగ్గు చేటని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. విజయసాయి రెడ్డి హద్దు మీరి నోరు జారీతే తాట తీసి కింద కూర్చోపెడతాం జాగ్రత్త అని పవన్ హెచ్చరించారు. ఐతే చాలా రోజులుగా పవన్ ను విమర్శిస్తున్న విజయ సాయి రెడ్డిపై పవన్ ఇంత ఘాటుగా మాట్లాడటం ఇదే తొలిసారి కావడం విశేషం.

English summary
Janasena's chief, Pawan Kalyan, has responded sharply to the YSR MP's success for the Long march of Pawan Kalyan in Visakhapatnam to bring people to the consciousness of the lack of sand or building workers' suicides.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X