పార్టీ నేతలకు పదవులు ఖరారు చేసిన పవన్ కల్యాణ్..!!

ఉప ముఖ్యమంత్రి పవన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. శాఖల పరంగా వరుసగా అధికారులతో సమీక్షలు చేస్తున్నారు. కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇక..ఈ రోజు తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పవన్ పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. తన శాఖ పంచాయితీ రాజ్ ఆర్దిక పరిస్థితి కారణంగా జీతం తీసుకోవటం లేదన్నారు. ఇక..అసెంబ్లీలో తన పార్టీ నుంచి విప్ ల నియామకం పైన పవన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు లేఖ రాసారు.

అసెంబ్లీలో జనసేనకు 21 ఎమ్మెల్యేల సంఖ్య బలం ఉంది. అందులో పవన్, మనోహర్, కందుల దర్గేష్ మంత్రులుగా ఉన్నారు. అసెంబ్లీ స్పీకర్ పదవి టీడీపీకి దక్కింది. అయ్యన్న పాత్రుడు స్పీకర్ అయ్యారు. డిప్యూటీ స్పీకర్ పదవి టీడీపీ తమ మిత్రపక్షాలకు ఇస్తుందనే వాదన ఉంది. అందులో భాగంగా జనసేనకు ఇస్తే ఇద్దరి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అదే సమయంలో టీడీపీ నుంచే డిప్యూటీ స్పీకర్ ఉంటారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీని పైన తుది నిర్ణయం జరగాల్సి ఉంది.

Pawan Kalyan Reccomends two names for Whips in Assembly letter to Chandra Babu

ఇక, అసెంబ్లీలో చీఫ్ విప్ గా టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పేరు ఖరారు కానున్నట్లు సమాచారం. ఇక..విప్ లుగా కూటమి లోని మూడు పార్టీలకు అవకాశం దక్కనుంది. జనసేన నుంచి ఇద్దరి పేర్లను సిఫార్సు చేస్తూ పవన్ సీఎం చంద్రబాబుకు లేఖ రాసారు. జనసేన నుంచి విప్ లుగా నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, రైల్వే కోడూరు నుంచి గెలిచిన శ్రీధర్ పేర్లను సిఫార్సు చేసారు. ఈ ఇద్దరినీ అసెంబ్లీలో తమ పార్టీ విప్ లుగా ఖరారు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు అధికారికంగా ఆదేశాలు వెలువడనున్నాయి. ఇక, డిప్యూటీ స్పీకర్..నామినేటెడ్ పదవుల పైన నిర్ణయం తీసుకోనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+