వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీ సాగు చట్టాల రద్దు ప్రకటన ఆయన రాజనీతిజ్ఞతకు నిదర్శనం : రైతుల పోరాటంపై పవన్ కళ్యాణ్

|
Google Oneindia TeluguNews

గతేడాది పార్లమెంటు సమావేశాలలో ఆమోదం పొందిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల లోని రాజకీయ ప్రముఖుల నుండి ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం పై హర్షం వ్యక్తమవుతోంది. ఏడాది కాలంగా రైతులు చేస్తున్న పోరాటాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అర్థం చేసుకున్నారని, అందుకే రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని భావిస్తున్న వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నారని, ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని రాజకీయ ప్రముఖులు పేర్కొంటున్నారు.

Recommended Video

Farm Laws Repeal : Pawan Kalyan మంచి ముగింపు.. పోరాటం విలువ | PM Modi || Oneindia Telugu
ప్రధాని ప్రకటన ఆయనలోని రాజనీతిజ్ఞతకు నిదర్శనం

ప్రధాని ప్రకటన ఆయనలోని రాజనీతిజ్ఞతకు నిదర్శనం


తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. రైతుల తరపున ప్రధానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు పవన్ కళ్యాణ్. అయితే రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని రూపొందించిన చట్టాలు రైతుల ఆమోదం పొందకపోవడంతో రానున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఈ చట్టాలను ఉపసంహరిస్తామని ప్రకటించారని, ఈ ప్రకటన ఆయనలోని రాజనీతిజ్ఞతను తెలుపుతుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

రైతుల పోరాటానికి మంచి ముగింపు ఆవిష్కృతం కావడం ఒక శుభ పరిణామం

రైతుల పోరాటానికి మంచి ముగింపు ఆవిష్కృతం కావడం ఒక శుభ పరిణామం

ఏడాది కాలంగా రైతుల సాగించిన పోరాటానికి ఇది ఒక ఫలప్రదమైన ముగింపు అని పేర్కొన్నారు. రైతుల పోరాటానికి మంచి ముగింపు ఆవిష్కృతం కావడం ఒక శుభ పరిణామమని హర్షం వ్యక్తం చేశారు. ఎండనక వాననక ఏడాదిపాటు ఈ ఉద్యమాన్ని కొనసాగించిన రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. సాగు చట్టాల రద్దు కోసం సుప్రీంకోర్టుకు వెళ్లిన రైతులు, రైతు నాయకులను మనస్ఫూర్తిగా అభినందించారు పవన్ కళ్యాణ్. పోరాటం చేస్తే సాధించలేనిది ఏదీ లేదని రైతులు ఉద్యమం మరోసారి నిరూపించిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గురునానక్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగాన్ని ఆద్యంతం పరిశీలిస్తే జనవాక్యం శిరోధార్యంగా భావించినట్టు మనకు అర్థమవుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

మోడీ నిర్ణయాన్ని స్వాగతించిన రాజకీయ నేతలు

మోడీ నిర్ణయాన్ని స్వాగతించిన రాజకీయ నేతలు

ఇక ఇప్పటికే మూడుసార్లు చట్టాన్ని వెనక్కి తీసుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారని సిపిఐ జాతీయ నేత నారాయణ పేర్కొన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సుదీర్ఘ పోరాటం చేశారని ఆయన వెల్లడించారు. సాగు చట్టాల రద్దు నిర్ణయాన్ని కేంద్రంతో చెప్పించిన రైతుల పోరాట స్ఫూర్తికి నారాయణ అభినందనలు తెలిపారు. ఎంతో మంది రైతులు ప్రాణాలు కోల్పోయినప్పటికీ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు అలుపెరగకుండా పోరాటం చేశారని, ఈ దేశం మొత్తం వారికి మద్దతుగా నిలిచిందని, అందుకే కేంద్రం దిగి వచ్చిందని సిపిఐ నేత నారాయణ వెల్లడించారు. అంతేకాదు ఈ పోరాటంలో మృతి చెందిన రైతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

సాగు చట్టాల రద్దుపై సర్వత్రా హర్షం

సాగు చట్టాల రద్దుపై సర్వత్రా హర్షం

ఎంత కఠినమైన హృదయమైనా కరగకమానదు అన్నట్లుగా మోదీ ఈ నిర్ణయాన్ని ప్రకటించడం సంతోషకరమని నారాయణ వెల్లడించారు. ఇప్పటికీ రైతులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆ సమస్యల పరిష్కారానికి కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని నారాయణ పేర్కొన్నారు. ఇక వ్యవసాయ చట్టాల రద్దును టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్వాగతించారు. రైతుల ఆందోళనకు స్పందించి బిల్లులు వెనక్కి తీసుకోవడం శుభ పరిణామం అన్నారు. రైతుల సమస్యలు చాలా ఉన్నాయని వాటి మీద దృష్టి పెడుతున్నామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం హర్షణీయమన్నారు. 3 సాగు చట్టాలను కేంద్రం ఉపసంహరించుకున్న విధంగా, మూడు రాజధానుల నిర్ణయాన్ని కూడా ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

English summary
Janasena chief Pawan Kalyan said Prime Minister Modi's announcement of repeal of cultivation laws was a testament to his diplomacy. He said that the discovery of a good end to the farmers protest was an auspicious development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X