మోదీ ఇచ్చారు, మరిచిపోకుండా చెయ్యాలి, పవన్ కల్యాణ్ ఆర్డర్

ఆంధ్రప్రదేశ్ లో కూటమి పాలన మొదలయ్యాక పంచాయతీలకు నిధుల సమస్య లేకుండా చేశామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు సత్వరమే మొదలుపెట్టాలని సంబంధిత అధికారులకు పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో పవన్ కల్యాణ్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే పనులు ప్రారంభం, గ్రామ సభలలో ఆమోదించిన పనుల ప్రారంభం గురించి సంబంధిత అధికారులతో శుక్రవారం డీసీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక సమావేశంలో చర్చించారు. 13, 326 పంచాయతీల్లో ఉపాధి హామీ పనులకు తీర్మానం చేశారని, వాటి పని దినాలు వివరాలను సంబంధిత అధికారులు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు వివరించారు.

Pawan Kalyan review with officials of Panchayati Raj and Rural Development Department

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం పాలన మొదలైన వంద రోజుల్లోనే 15వ ఆర్థిక సంఘం నుంచి రూ. 1,987 కోట్లు, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రూ. 4,500 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. అక్టోబర్ 14వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పంచాయతీలో ఇదే నిధులతో అభివృద్ధి పనులు మొదలుపెట్టాలని, ఆ సందర్బంలో అక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు డీసీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.

పంచాయతీల్లో మొదలుపెట్టిన పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 20వ తేదీ వరకు పంచాయతీల్లో పనుల ప్రారంభానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించాలని పవన్ కల్యాణ్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 14వ తేదీ నుంచి వారం రోజులపాటు అభివృద్ధి పనుల ప్రారంభాన్ని పండగల నిర్వహించాలని పవన్ కల్యాణ్ అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమాల్లో స్థానిక గ్రామస్తులను, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను భాగం చేయాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంబంధిత వెబ్ సైట్, డ్యాష్ బోర్డు ను ప్రారంభించారు. ఈ సమావేశంలో గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు, కొన్ని జిల్లాల అధికారులు పాల్గొని పలు అభివృద్ధి పనుల విషయం గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+