• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పవన్ కళ్యాణ్ భారీ విరాళాలు: పీఎం కేర్స్‌తోపాటు తెలుగు రాష్ట్రాలకు, జగన్ సర్కారుపై ఫైర్

|

హైదరాబాద్/అమరావతి: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనవంతుగా కేంద్ర ప్రభుత్వంతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు భారీ సాయాన్ని అందించారు. ఇప్పటికే దేశంతోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని ప్రజలకు సూచించారు.

అక్కడి భారతీయులను ఆదుకోండంటూ ఫోన్: పవన్ కళ్యాణ్ విజ్ఞప్తికి స్పందించిన కేంద్రం

పవన్ కళ్యాణ్ భారీ విరాళాలు..

కరోనాపై పోరాటంలో భాగంగా పవన్ కళ్యాణ్ తాను ఇప్పటికే ప్రకటించినట్లుగా పీఎంకేర్స్ ఫండ్‌కు రూ. కోటి సాయాన్ని విరాళంగా అందజేశారు. కరోనావైరస్ కట్టడి కోసం తాను ప్రధానమంత్రి సహాయ నిధికి రూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 50, తెలంగాణకు రూ. 50 లక్షలు విరాళంగా ఇస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.

పవన్ కళ్యాణ్ పిలుపు..

ఆ మాట ప్రకారమే పీఎం కేర్స్ ఫండ్ బ్యాంక్ ఖాతాకు రూ. కోటి బదిలీ చేసినట్లు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అదే విధంగా తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షలను విరాళంగా అందించారు. కరోనాపై యావత్ భారతదేశం చేస్తున్న పోరాటానికి తమవంతుగా ఆర్థిక చేయూతను అందిద్దామని, మరింత బలంగా కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రధానికి అండగా నిలుద్దామని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

వైద్యులకు అండగా నిలవాలి..

కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే తమ ప్రాణాలకు ముప్పు ఉంటుందని తెలిసి కూడా ఆ వైరస్ పీడితులకు, అనుమానితులకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్, ఇతర సిబ్బంది ఆరోగ్యాన్ని ఎవరూ విస్మరించకూడదు. ఇంట్లో ఉన్న తమ బిడ్డల్ని వదిలి వచ్చి ఆస్పత్రిలో విధులు నిర్విర్తిస్తున్నారు. తిరిగి ఇంటికి వెళ్లినప్పుడు ఆ చిన్నారులకీ, ఎవరైనా వృద్ధులు ఉంటే వారికీ ప్రమాదం అని తెలిసి కూడా సేవలు చేస్తున్నారు. అలాంటి వైద్యులు, సంబంధిత సిబ్బందికి అవసరమైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్(పీపీఈ) పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచకపోవడం దురదృష్టకరమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

ఆయుధాలు లేకుండా యుద్ధానికి.. జగన్‌కు పవన్ ప్రశ్న..

ఆయుధాలు లేకుండా సైనికులను యుద్ధానికి పంపడం న్యాయమా? అలాగే వైద్య సిబ్బందికి అవసరమైన పీపీఈలు ఇవ్వకుండా వైరస్‌తో యుద్ధం పంపడం న్యాయమా? అలాగే వైద్య సిబ్బందికి అవసరమైన పీపీఈలు ఇవ్వకుండా వైరస్‌తో యుద్ధం చేయించాలనుకోవడం ధర్మం కాదు. కోవిడ్-19కి వైద్యం, పరీక్షలు చేసే సిబ్బంది ఏ విధమైన మెడికల్ మాస్కులు, గౌన్స్, గ్లోవ్స్, కంటి అద్దాలు/ఫేస్ షీల్డ్ ధరించాలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్ఓ) నిర్దేశించింది. అందుకు అనుగుణంగా వైద్యులకు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రుల్లో వాటిని తగిన విధంగా సమకూర్చకపోవడంతో వైద్య సిబ్బంది ఆందోళనలో ఉన్నారు.

  Pawan Kalyan Urges S Jaishankar To Help Stranded Indian Students In UK

  జగన్ సర్కారు వెంటనే స్పందించాలి..

  ఎన్-95 మాస్కులు కూడా సమకూర్చలేదని, సాధారణ డిస్పో జబుల్ గౌన్స్ మాత్రమే ఇస్తున్నారనే వైద్యుల మాటను ఒకసారి వినండి. నిర్దేశించిన విధంగా వ్యక్తిగత రక్షణ పరికరాలు, దుస్తులు ఇస్తేనే సిబ్బంది ధైర్యంగా విధులు నిర్వర్తించగలరు. వైద్యులు, సిబ్బందికి ఇస్తున్న పీపీఈలపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలి. తమ ప్రాణాలను, తమ కుటుంబ ప్రాణాలను పణంగా పెట్టి వైద్యం చేస్తున్నవారి సేవలను గుర్తించాలి. వారి ఆరోగ్య క్షేమాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలి. వాళ్లని ఆపదలోకి నెట్టేయకుండా అవసరమైన అన్ని రక్షణ చర్యలు చేపట్టాలని వైసీపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. కాగా, ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపుకు పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు.

  English summary
  pawan kalyan Rs 2 cr donations to pm cares and telugu states for fight against corona.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more