పవన్ పోటీ నియోజకవర్గం ఫిక్స్ - ద్వారంపూడి సవాల్ తో, అక్కడే ట్విస్ట్..!!

ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ జనసేనాని పవన్ ప్రజల మధ్యకు వచ్చారు. వచ్చే ఎన్నికల్లో సీఎం అయ్యే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అసెంబ్లీకి పంపాలని అభ్యర్ధిస్తున్నారు. గత ఎన్నికల్లో రెండు నియోజక వర్గాల్లో పోటీ చేసిన పవన్ రెండు చోట్ల ఓడిపోయారు. ఈ సారి ఎన్నికల్లో తనను ఓడించేందుకు సీఎం జగన్ రూ 200 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్దపడుతున్నారని పవన్ చెబుతున్నారు. ఇదే సమయంలో పవన్ తన నియోజకవర్గం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

పవన్ పోటీ ఎక్కడి నుంచి
జనసేనాని పవన్ ఈ సారి అసెంబ్లీలో అడుగు పెట్టటం ఖాయమని చెబుతున్నారు. తాను ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గం కోసం ఇంతకాలంగా అన్వేషించారు. ఈ మధ్య కాలంలోనే పవన్ తన బలంతో పాటుగా పార్టీ ఎక్కడెక్కడ బలంగా ఉందనే అంశాలతో సర్వే చేయించారు. అందులో గోదావరి జిల్లాల పైన ప్రతీ నియోజకవర్గం ఆధారంగా వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా తాను పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్న ఆరు స్థానాల్లోనూ సర్వే చేయించారని సమాచారం. అందులో గతంలో పోటీ చేసి ఓడిన భీమవరం కూడా ఉందని చెబుతున్నారు. తాజాగా వారాహి యాత్ర సమయంలోనే పవన్ తాను పోటీ చేసే నియోజకవర్గం పైన పరోక్షంగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

Pawan Kalyan

రెండు స్థానాల్లో పోటీకి సిద్దం
పవన్ కల్యాణ్ ఈ సారి పిఠాపురం నుంచి పోటీ చేయటం ఖాయమని చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది. పవన్ పిఠాపరం వారాహి యాత్ర సభలోనూ పరోక్షంగా ఈ నియోజకవర్గం పైన తన ఆసక్తిని ప్రదర్శించారు. పిఠాపురంలో కొత్తగా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో స్థానికంగా ఒక ఇల్లు కట్టుకుంటానని పవన్ వెల్లడించారు. పిఠాపురం పైన సర్వే చేయించిన తరువాత ఈ నియోజకవర్గం వైపు పవన్ మొగ్గు చూపించారని పార్టీ నేతల సమాచారం. 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి నుంచి పోటీ చేయటంతో ఈ సారి తూర్పు గోదావరిలో పోటీకి సిద్దం అవుతన్నట్లు తెలుస్తోంది. ఏపీలో అధికారంలోకి రావాలంటే గోదావరి జిల్లాలు..అందునా తూర్పు గోదావరి డిసైడింగ్ ఫ్యాక్టర్ కావటంతో తాను అక్కడి నుంచి బరిలో ఉంటే కలిసి వస్తుందని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Pawan Kalyans

ద్వారంపూడి సవాల్ కు స్పందిస్తారా
ఇదే సమయంలో ఇప్పుడు పవన్ కాకినాడలో చేసిన సవాల్ కు అక్కడి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ధీటుగా స్పందించారు. కాకినాడలో తనను ఓడించటం పవన్ కు సాధ్యం కాదని..దమ్ముంటే పవన్ కాకినాడ నుంచి పోటీ చేసి తనపై గెలవాలని సవాల్ చేసారు. దీంతో, ఇప్పుడు ద్వారంపూడి సవాల్ కు తాను స్పందించటం ఏంటని వదిలేస్తారా..లేక తూర్పు గోదావరి నుంచి పోటీకి సిద్దం అవుతున్న సమయంలో కాకినాడనే తన నియోజకవర్గంగా ఎంచుకుంటారా అనేది ఆసక్తి కరంగా మారుతోంది. పవన్ ఈ సారి 2019లో లాగానే రెండు స్థానాల్లో పోటీ చేయనున్నట్లు చెబుతున్నారు. తూర్పు గోదావరితో పాటుగా తిరుపతి లేదా అనంతపురం అర్బన్ లో సర్వేలు..వర్గాల వారీ సమాచారం సేకరిస్తున్నారని సమాచారం. తూర్పు గోదావరి నియోకవర్గం పైన తొలి విడత వారాహి ముగిసేలోగా ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+