Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కళ్యాణ్ ను ఓడించటమే అచీవ్మెంట్ .. గ్రంధి శ్రీనివాస్ కు మంత్రి పదవి ? పశ్చిమగోదావరి జిల్లాలో హాట్ డిబేట్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో మంత్రివర్గంలో చోటు కోసం ఆశావహులు పోటీపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం నుండి గ్రంధి శ్రీనివాస్ మంత్రివర్గంలో స్థానం కోసం తహతహలాడుతున్నట్లుగా తాజా పరిణామాలతో అర్థమవుతుంది. నిన్న గ్రంధి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న భావనను కలిగిస్తున్నాయి.

 పశ్చిమగోదావరి జిల్లాలో ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం

పశ్చిమగోదావరి జిల్లాలో ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో గత ఎన్నికల సమయంలో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. టిడిపికి కంచుకోటగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాల్లో 13 స్థానాల్లో వైసీపీ విజయభేరి మోగించింది. జిల్లా నుండి ముగ్గురికి మంత్రులకు అవకాశం దక్కింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా తానేటి వనిత కు, అలాగే గృహ నిర్మాణ శాఖ మంత్రిగా శ్రీరంగనాథ రాజుకు వైయస్ జగన్మోహన్ మంత్రివర్గంలో స్థానం కల్పించారు.

ఆళ్ళ నాని, శ్రీ రంగనాథ రాజు, తానేటి వనితల పనితీరు పరిశీలన

ఆళ్ళ నాని, శ్రీ రంగనాథ రాజు, తానేటి వనితల పనితీరు పరిశీలన

పనితీరు ఆధారంగా రెండున్నర సంవత్సరాల తర్వాత మళ్లీ మంత్రివర్గ విస్తరణ చేస్తానని, మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చోటుచేసుకుంటాయని జగన్మోహన్ రెడ్డి ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ ముగ్గురు మంత్రుల పనితీరుపై విశ్లేషణలు జరుపుతున్న జగన్మోహన్ రెడ్డి పనితీరులో బాగా వెనుకబడిన గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు , స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితకు గాని ఉద్వాసన పలకాలని భావిస్తున్నట్లుగా ఆసక్తికర చర్చ జరుగుతుంది.

ఆళ్ళ నాని పనితీరుపైనా జిల్లాలో చర్చ

ఆళ్ళ నాని పనితీరుపైనా జిల్లాలో చర్చ

ఇక వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్న ఆళ్లనాని పని తీరుపై కూడా జగన్ లో తీవ్ర అసంతృప్తి ఉన్నట్లుగా సమాచారం. కరోనా సమయంలో ప్రతిపక్షాల విమర్శలకు అవకాశం ఇచ్చేలా వైద్య ఆరోగ్య శాఖ పనితీరు, అంతేకాకుండా ఏలూరులో వింత వ్యాధి వంటి కారణాలు ఆళ్ల నాని విషయంలో జగన్ ను ఆలోచించేలా చేస్తున్నాయి. గత ఎన్నికల్లో కూడా నానీ పెద్దగా దూసుకుపోయింది కూడా లేదు .కేవలం మూడు వేల ఓట్లతో ఆళ్ళ నాని విజయం సాధించడం తెలిసిందే. అయితే ఇదే సమయంలో ఏలూరులో పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతు, నాని ఓటు కూడా వేసుకోలేని పరిస్థితులు, కాపు సామాజిక వర్గం నుండి మరో నేతకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచన వెరసి ఆళ్ల నానికి కూడా ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నాయన్న చర్చ జరుగుతుంది.

 భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇస్తారని చర్చ

భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇస్తారని చర్చ

ఇదే క్రమంలో ఈసారి భీమవరం ఎమ్మెల్యే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఓడించిన నేత గ్రంధి శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇస్తారు అన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పార్టీ పెద్దలు కూడా గ్రంధి శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇవ్వడం సమంజసమే అన్న భావనలో ఉన్నారని సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీపై పోరాటం సాగిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ఓడించటమే గ్రంధి శ్రీనివాస్ కు ప్లస్ అని అంతా భావిస్తున్నారు. ఇక ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ను ఓడిస్తే గ్రంధి శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే త్వరలో ఏపీలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని అందరూ భావిస్తున్న క్రమంలో మంత్రి వర్గ విస్తరణలో గ్రంధి శ్రీనివాస్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది.

 తాజాగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వ్యాఖ్యలు అందుకు కారణం

తాజాగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వ్యాఖ్యలు అందుకు కారణం

అందుకు ఊతమిస్తూ గ్రంధి శ్రీనివాస్ ఇటీవల జనసేన పార్టీ కార్యకర్తలపై విరుచుకు పడటం, వారిని తాలిబన్లతో పోలుస్తూ మాటలతో దాడి చేయడం, ఇక పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించడం తెలిసిందే. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా గ్రంధి శ్రీనివాస్ పవన్ విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను తాను ఓడించానని పదేపదే గుర్తు చేస్తూ, జగన్ మంత్రిగా అవకాశం ఇస్తే భీమవరం అభివృద్ధికి కృషి చేస్తానని గ్రంధి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.ఆయన వ్యాఖ్యల్లో కూడా తాను మంత్రి పదవి ఇస్తే పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని, తన మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నాను అన్న భావన ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

పవన్ ను ఓడించటం పెద్ద అచీవ్ మెంట్ .. మంత్రి పదవి ఇవ్వాల్సిందే అంటున్న గ్రంధి వర్గం

పవన్ ను ఓడించటం పెద్ద అచీవ్ మెంట్ .. మంత్రి పదవి ఇవ్వాల్సిందే అంటున్న గ్రంధి వర్గం

గ్రంధి శ్రీనివాస్ అనుయాయులు కూడా పవన్ కళ్యాణ్ ను ఓడించటం కంటే ఇంకా పెద్ద అచీవ్మెంట్ ఏముంటుంది. గ్రంధి శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇచ్చి తీరాల్సిందేనంటూ తమ వాదన బలంగా వినిపిస్తున్నారు. అంతేకాదు మళ్లీ పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తే ఆయనను బలంగా ఎదుర్కోవడం కోసం గ్రంధి శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది అన్న భావన పార్టీలో వ్యక్తమౌతుంది. మొత్తానికి ఒక పక్క పార్టీ అగ్ర నాయకుల్లో మంత్రివర్గ విస్తరణ పై జరుగుతున్న చర్చలు, మరోపక్క భీమవరంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు వెరసి గ్రంధి శ్రీనివాస్ పేరు పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధానంగా వినిపిస్తుంది.

Recommended Video

    Janasena Silence Over BJP's Fight Against AP Govt| YSRCP | Tippu Sultan | AP | Oneindia Telugu
     పశ్చిమ గోదావరి నుండి మంత్రిగా గ్రంధికి ఛాన్స్ .. జగన్ నిర్ణయం ఏమిటో ?

    పశ్చిమ గోదావరి నుండి మంత్రిగా గ్రంధికి ఛాన్స్ .. జగన్ నిర్ణయం ఏమిటో ?

    ఈసారి పశ్చిమగోదావరి జిల్లాలో మంత్రి వర్గంలో స్థానం దక్కించుకుంటే అది ఖచ్చితంగా గ్రంధి శ్రీనివాస్ నే అని పార్టీ శ్రేణులు బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. మరి పవన్ కళ్యాణ్ ని ఓడించిన కారణం చూపించి, మంత్రిగా ఛాన్స్ కొట్టేయాలని చూస్తున్న గ్రంధి శ్రీనివాస్ కు జగన్ మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారా లేదా అనేది మరి కొద్ది రోజుల్లో తేలనుంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+