రోహిత్ శర్మ ఇన్నింగ్ కు తెర దించిన శుభ్‌మన్ గిల్.. రనౌట్

అఫ్ఘనిస్తాన్ తో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ ఓ అరుదైన మైలురాయిని అందుకున్నప్పటికీ.. తక్కువ స్కోర్ కే రనౌట్ కావడం వివాదాస్పదమైంది. ఓపెనర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో 16,000 పరుగులు పూర్తి చేసిన రోహిత్.. వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును చెరిపేశాడు. ఆయన ఈ ఘనత సాధించిన రెండో టీమిండియా ఓపెనర్‌గా నిలిచారు. ఈ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్.. అనూహ్యమైన రనౌట్‌తో ముగిసింది.

శనివారం రాత్రి ధర్మశాల స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రోహిత్ తన సహజ శైలిలో చెలరేగాడు. తొలి ఓవర్లలోనే రెండు బౌండరీలు, ఓ భారీ సిక్సర్‌తో టచ్‌లో ఉన్నట్టు కనిపించాడు. 16,000 పరుగుల మైలురాయిని దాటగానే స్టేడియం మొత్తం 'రోహిత్-రోహిత్’ నినాదాలతో మార్మోగింది. అభిమానులు అతని నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించారు. అంతా సవ్యంగా సాగుతోందనుకుంటోన్న దశలో ఆరో ఓవర్‌లో మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది.

Rohit Sharma walking back after controversial run-out

రోహిత్ శర్మ రనౌట్ లో కీలక మలుపు

ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ అల్లా మహమ్మద్ ఘజన్‌ఫర్ వేసిన ఆరో ఓవర్ నాలుగో బంతిని రోహిత్ మిడ్ వికెట్ వైపు ఆడాడు. సింగిల్ కోసం పరుగెత్తాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న శుభ్‌మన్ గిల్ కూడా రన్ కోసం ప్రయత్నించాడు.. గానీ మిడ్ వికెట్ లో ఫీల్డింగ్ చేస్తోన్న రషీద్ ఖాన్ వెంటనే బంతిని అందుకోవడంతో ఆగిపోయాడు. అప్పటికే రోహిత్ శర్మ సగం పిచ్ వరకు వచ్చేశాడు.

బంతిని అందుకున్న రషీద్ ఖాన్ దాన్ని వికెట్ కీపర్ రహ్మనుల్లా గుర్బాజ్ వైపు విసరడం, బౌలర్ ఫాలో త్రూ వెనుక రోహిత్ చిక్కుకుపోవడం, సగం దూరం వచ్చాక గిల్ వెనక్కి వెళ్లమని సంకేతం ఇవ్వడంతో రోహిత్‌కు తిరిగి క్రీజ్ చేరే అవకాశం లేకుండా పోయింది. రషీద్ ఖాన్ నుంచి బంతిని అందుకున్న వికెట్ కీపర్ రహ్మనుల్లాహ్ గుర్బాజ్‌కు మెరుపు వేగంతో వికెట్లను గిరాటేయడంతో రోహిత్ ఇన్నింగ్ కు తెరపడింది.

శుభ్‌మన్ గిల్ పొరపాటుపై చర్చ

ఈ ఘటనలో గిల్ తప్పిదమే ప్రధాన చర్చగా మారింది. ఓపెనింగ్ జోడీకి పరస్పర అవగాహన, కాల్‌కు వెంటనే స్పందించడం చాలా అవసరం. ఇక్కడ గిల్ ఒక్క క్షణం ఆలస్యం భారత ఇన్నింగ్స్ రిథమ్ ను దెబ్బతీసింది. రోహిత్ శర్మ 16 బంతుల్లో 16 పరుగులు చేశారు. అందులో 2 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. అయోమయ స్థితిలో అతని ఇన్నింగ్ ముగిసింది.

రోహిత్ శర్మ ఆగ్రహం, గిల్‌కు పాఠం

పెవిలియన్ వైపు నడుస్తున్నప్పుడు రోహిత్ ముఖంలో నిరాశ స్పష్టంగా కనిపించింది. ఆయన శుభ్‌మన్ గిల్ వైపు తిరిగి చూడకుండానే వెళ్లిపోయాడు. తనలో తాను గొణుక్కుంటూ, రీప్లే కోసం గానీ, థర్డ్ అంపైర్ నిర్ణయం కోసం గానీ వేచి చూడకుండా బౌండరీ లైన్ దాటాడు. ఒక సెటిల్డ్ బ్యాటర్, కెప్టెన్ ఇలాంటి పరిస్థితిలో ఔట్ కావడం టీమిండియా క్యాంప్ ను నిశ్శబ్దంలోకి నెట్టింది. క్రికెట్‌లో రన్ అవుట్లు సహజమే అయినా, ఈ సందర్భం గిల్ మ్యాచ్ అవేర్‌నెస్‌పై ప్రశ్నలు లేవనెత్తింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+