రీ రిలీజ్ మూవీతో చరణ్ "పెద్ది"ని బీట్ చేసిన అల్లు అర్జున్..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు కేరళలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఎలా అభిమానులను సంపాదించుకున్నారో, మలయాళంలో కూడా ఆయనకు అంతే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్, స్టైలిష్ డ్యాన్సులు, యూత్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్, విభిన్నమైన నటన మాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత తాను నటించే ప్రతి సినిమాను మలయాళంలో డబ్ చేసి విడుదల చేస్తూ తన మార్కెట్‌ను మరింత విస్తరించుకున్నారు.
20 ఏళ్ల తర్వాత 'హ్యాపీ'తో మరోసారి సంచలనం..
కాగా అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు ఎ. కరుణాకరన్ తెరకెక్కించిన 'హ్యాపీ' చిత్రం 2006లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను మలయాళంలో 'హ్యాపీ బీ హ్యాపీ' పేరుతో డబ్ చేశారు. ఇప్పుడు దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని 4K ఫార్మాట్‌లో మళ్లీ కేరళలో రీ-రిలీజ్ చేయగా, ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. సాధారణ రీ-రిలీజ్‌లకు భిన్నంగా, ఈ సినిమాకు కొత్త సినిమా విడుదలైనట్లుగా భారీ స్థాయిలో ప్రేక్షకులు థియేటర్లకు తరలివస్తున్నారు.

'హ్యాపీ' రీ-రిలీజ్ సందర్భంగా కేరళలోని అనేక థియేటర్ల వద్ద అభిమానులు పండగ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. షోలన్నీ హౌస్‌ఫుల్ అవుతుండగా, థియేటర్‌లలో పాటలు వస్తే అభిమానులు డ్యాన్సులు చేస్తూ, ఈలలు వేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. భారీ కటౌట్లు, బ్యానర్లు, పాలాభిషేకాలు, డప్పులతో బన్నీ అభిమానులు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఓపెనింగ్ కలెక్షన్స్‌లో రికార్డు..
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, 'హ్యాపీ' రీ-రిలీజ్ కేరళలో తొలి రోజే దాదాపు రూ.30 లక్షల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇటీవల మలయాళంలో విడుదలైన రామ్ చరణ్ 'పెద్ది' సినిమా తొలి రోజు సుమారు రూ.20 లక్షలు, ప్రభాస్ 'ది రాజాసాబ్' చిత్రం రూ.19 లక్షల గ్రాస్ సాధించగా, దాదాపు 20 ఏళ్ల క్రితం వచ్చిన 'హ్యాపీ' చిత్రం వీటి కంటే ఎక్కువ ఓపెనింగ్స్ రాబట్టడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కేరళలో రీ-రిలీజ్ చిత్రాల కలెక్షన్స్ పరంగా కూడా 'హ్యాపీ' కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 'బాహుబలి: ది ఎపిక్' రీ-రిలీజ్ సమయంలో రూ.26.5 లక్షల గ్రాస్ సాధించగా, ఇప్పుడు 'హ్యాపీ' రూ.30 లక్షలతో ఆ రికార్డును అధిగమించింది. దీంతో కేరళలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన రీ-రిలీజ్ చిత్రాల్లో 'హ్యాపీ' రెండో స్థానాన్ని దక్కించుకుంది.
Answara and her sister vibing for #happy re-release pic.twitter.com/X673YrtfEm
— Rishi (@Sirivennala1309) June 13, 2026
అయితే 'పుష్ప' సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయినా, కేరళలో ఆయన స్టార్‌డమ్ చాలా ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. 'ఆర్య', 'బన్నీ', 'హ్యాపీ', 'దేశముదురు' వంటి సినిమాల ద్వారా అక్కడి ప్రేక్షకులతో ఆయనకు ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. కాలక్రమేణా ఆ అనుబంధం మరింత బలపడుతూ, అల్లు అర్జున్‌ను కేరళ ప్రేక్షకులు తమ హీరోగా భావించే స్థాయికి చేరుకుంది.
అందుకే బన్నీని అక్కడి ప్రేక్షకులు ప్రేమగా 'మల్లు అర్జున్' అని పిలుస్తుంటారు. ఒక తెలుగు హీరోను కేరళ ప్రేక్షకులు ఈ స్థాయిలో ఓన్ చేసుకోవడం అనేది చాలా అరుదైన విషయం.
Only Tracked Shows Day 1 Gross :#Happy4K : 27L*#Peddi: 20L#TheRajaSaab: 19L
— CB (@Babu_Cinemaa) June 12, 2026
Highest Telugu Opening of 2025 Belongs to Mallu Arjun’s Re-release












Click it and Unblock the Notifications