వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనవసరంగా కొందర్ని పెద్దవాళ్లని చేయొద్దు: కత్తి మహేష్‌పై పవన్ పరోక్ష సెటైర్!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/ప్రకాశం: గత కొంత కాలంగా ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని సినీ క్రిటిక్ కత్తి మహేష్ విమర్శలు చేస్తున్నారు. తాజాగా, విశాఖ, ప్రకాశం పర్యటనల్లో పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలను కూడా ఆయన తప్పుబట్టారు.

పవన్ గొప్పలపైనే! హింసిస్తున్నారు: మరోసారి కత్తి మహేష్ విమర్శలుపవన్ గొప్పలపైనే! హింసిస్తున్నారు: మరోసారి కత్తి మహేష్ విమర్శలు

పవన్! ఇంత చవటా?: జగన్ పార్టీ ఎమ్మెల్యే అనిల్ తీవ్ర వ్యాఖ్యలు, 'పవన్ అలా అనలేదు' పవన్! ఇంత చవటా?: జగన్ పార్టీ ఎమ్మెల్యే అనిల్ తీవ్ర వ్యాఖ్యలు, 'పవన్ అలా అనలేదు'

పవన్ తన వ్యాఖ్యలతో అజ్ఞానవాసి అని తెలుస్తోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు కత్తి మహేష్. అంతేగాక, ఏదైనా సూచనలు, సలహాలు కావాలంటే తనను సంప్రదించవచ్చని వ్యాఖ్యానించారు.

విమర్శలు చేసేవాళ్ళుంటారు..

విమర్శలు చేసేవాళ్ళుంటారు..

ఈ నేపథ్యంలో కత్తి మహేష్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరోక్షంగా సెటైర్ వేశారు. ఎవరైనా బలమైన గొంతును వినిపిస్తున్నప్పుడు విమర్శలు చేసేవాళ్లు ఉంటారని ఆయన అన్నారు. ఇలాంటి వాటిని తాను పట్టించుకోనని చెప్పారు. తాను బంగారాన్ని కాదని... తాను కూడా మనిషినేనని ఆయన అన్నారు.

నాలాగే ఉండండి..

నాలాగే ఉండండి..

తనలోని కొన్ని అంశాలు కొందరికి నచ్చుతాయని, కొన్ని అంశాలు కొందరికి నచ్చవని చెప్పారు. తనను ద్వేషించే వ్యక్తులు వారి అమూల్యమైన కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నట్టేనని తెలిపారు. మనిషి నవ్వితే కొంతమేర కండరాలు కదులుతాయని అన్నారు. అలాగే ఒకరిని ద్వేషించే సమయంలో మాత్రం శరీరం మొత్తం ప్రభావితమవుతుందని.. రక్తం పాడవుతుందని, ముఖంలోని కండరాలు పాడవుతాయని చెప్పారు. మీరు కూడా తనలాగానే ఉండాలని జనసేన కార్యకర్తలకు సూచించారు.

చచ్చేంత సహనం వద్దు

చచ్చేంత సహనం వద్దు

ప్రతి వ్యక్తికి సహనం ఉండాలని... అయితే, మనం చచ్చిపోయేంత సహనం మాత్రం అవసరం లేదని పవన్ అన్నారు. అంతటి సహనాన్ని తాను కూడా భరించలేనని చెప్పారు. మనం చేతులు కట్టుకుని కూర్చోవాల్సిన అవసరం లేదని, అదే సమయంలో ఎదురుదాడి చేయాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. అవసరమైన సందర్భాల్లో స్వీయ రక్షణ చేసుకుందామని చెప్పారు.

అనవసరం పెద్దవాళ్లను చేయొద్దు..

అనవసరం పెద్దవాళ్లను చేయొద్దు..

ఎవరైనా విమర్శలు చేస్తున్నప్పుడు పట్టించుకోవద్దని, లేకపోతే, కొన్ని రోజుల తర్వాత అనవసరంగా కొందరిని పెంచి, పెద్దవాళ్లను ఎందుకు చేశామా? అనే మీకు అనిపిస్తుందని అన్నారు. ఈ వ్యాఖ్యలు కత్తి మహేష్‌ను ఉద్దేశించి పరోక్షంగా అన్నట్లు తెలుస్తోంది.

అది బేసిక్ కర్టసీ

అది బేసిక్ కర్టసీ

కాగా, తనను షబ్బీర్ అలీ, దానం నాగేందర్‌లు కూడా తిడతారని, కానీ, ఎక్కడైనా ఎదురుపడితే చాలా బాగా మాట్లాడుకుంటామని చెప్పారు. తాను కూడా ఎందరినో ఏదేదో అంటుంటానని, ఆ తర్వాత వారితో మాట్లాడుతూనే ఉంటానని పవన్ చెప్పారు. ఎందుకంటే, అది బేసిక్ కర్టసీ అని వ్యాఖ్యానించారు.

English summary
Janasena president Pawan Kalyan done satire on Film critic kathi mahesh for his comments on him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X