జనసేన మళ్లీ 100 శాతం స్ట్రైక్ రేట్ - ఈవీఎం అయినా.. బ్యాలెట్ అయినా..!!

మున్సిపల్ ఎన్నికల్లో జనసేన మళ్లీ 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించింది. మున్సిపల్ ఫలితాల్లో కూటమి ఏకపక్షంగా విజయం సాధించింది. 12 కార్పోరేషన్లలో గెలిచింది. వైసీపీ ఒక కార్పోరేషన్.. నాలుగు మున్సిపాల్టీలకు పరిమితం అయింది. కూటమి పొత్తుల లెక్కల్లో భాగంగా జనసేనకు కేటాయించిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించింది. ఫలితాల పైన స్పందించిన పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈవీఎం అయినా.. బ్యాలెట్ అయినా విజయం కూటమిదే అని పేర్కొన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో జనసేన మరో రికార్డు నెలకొల్పింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన రెండు లోక్ సభ.. 21 అసెంబ్లీ స్థానాలు విజయం సాధించింది. తిరిగి ఇప్పుడు అనేక చర్చ ల తరువాత మున్సిపల్ పొత్తుల లెక్కల్లో జనసేనకు నాలుగు మేయర్, 15 మున్సిపాల్టీలు, మూడు నగర పంచాయితీలు దక్కాయి. కాగా.. జనసేనకు కేటాయించిన కార్పోరేషన్లలో శ్రీకాకుళం, కాకినాడకు ఎన్నిక జరగాల్సి ఉంది. ఎన్నిక జరిగి.. జనసేనకు కేటాయించిన ఏలూరు, విజయవాడ కార్పోరేషన్లతో పాటుగా 15 మున్సిపాల్టీలు.. మూడు నగర పంచాయితీలను జనసేన గెలవటంతో మరో సారి వంద శాతం స్ట్రైక్ రేటు సాధించింది. కాగా.. ఈ ఫలితం పైన పవన్ స్పందించారు.
ఈవీఎం అయినా.. బ్యాలెట్ అయినా విజయం కూటమిదేనని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ పాలనపై పట్టణ, నగర ప్రజలు విశ్వాసం చూపారని వ్యాఖ్యానించారు. జనసేనకు దక్కిన బలమైన మద్దతుకి కృతజ్ఞతలు తెలిపారు.

వైసీపీ ఖాతాలో అనంతపురం మేయర్ - లాస్ట్ మినిట్ లో, అనూహ్యంగా..!!
వైసీపీ ఖాతాలో అనంతపురం మేయర్ - లాస్ట్ మినిట్ లో, అనూహ్యంగా..!!
pawan-kalyan-says-alliance-will-win-regardless-of-evm-or-ballot-voting-here-the-details

జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపు పైనా ధీమా

నగర పాలక, పురపాలక, నగర పంచాయతీ ఎన్నికల్లో కూటమి పక్షాలకు దక్కుతున్న అఖండ విజయాలు ఇవని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వ పాలనకు దక్కిన మద్దతుగా భావిస్తున్నామని.. ఇది ఎంతో అమూల్యమైన తీర్పు అని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు చేసే విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై పట్టణ ప్రజలు విశ్వాసం కనబరుస్తున్నారు అనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన పార్టీ ఈవీఎంలను నిందించిందని విమర్శించారు. ఇప్పుడు బ్యాలెట్ ద్వారా చేపట్టిన స్థానిక ఎన్నికల్లోనూ ప్రజలు అదేస్థాయి విజయాన్ని కూటమికి ఇచ్చారని వెల్లడించారు. ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా ప్రజలు కూటమి పక్షాన ఉన్నారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీకి దక్కిన బలమైన మద్దతు ఎంతో విలువైనదని చెప్పుకొచ్చారు. మునిసిపాలిటీ ఎన్నికల్లో వచ్చిన ఘన విజయాన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ సాధిస్తామనే విశ్వాసం తమకు ఉందని పవన్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+