వైసీపీ ఖాతాలో అనంతపురం మేయర్ - లాస్ట్ మినిట్ లో, అనూహ్యంగా..!!
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా కొనసాగింది. ఏకపక్షంగా కార్పోరేషన్లు, మున్సిపాల్టీలను కూటమి పార్టీలు దక్కించుకున్నాయి. 13 కార్పోరేషన్లలో 12 చోట్ల కూటమి విజయం సాధించగా.. ఉత్కంఠ పరిణామాల వేళ వైసీపీ అనంతపురం మేయర్ స్థానం దక్కించుకుంది. అర్ద్రరాత్రి వేళ అనంతపురం మేయర్ గా వైసీపీ విజయ్ సాధించినట్లు ప్రకటించారు. దీంతో.. వైసీపీకి సీమ ప్రాంతంలో ఈ గెలుపు బిగ్ రిలీఫ్ గా మారనుంది.
వైసీపీకి ఎట్టకేలకు ఒక కార్పోరేషన్ దక్కింది. కూటమి పొత్తుల్లో భాగంగా అనంతపురం మేయర్ సీటు ను బీజేపీకి కేటాయించారు. ఇక్కడ బీజేపీ అగ్రనాయకత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఎలాగైనా మేయర్ సీటు గెలవాలని వ్యూహాలు రచించింది. కాగా.. వైసీపీ అధినేత ఇక్కడ అభ్యర్ది ఎంపిక బాధ్యత స్థానిక నేతలకు అప్పగించారు. చర్చల తరువాత రమేష్ గౌడ్ ను వైసీపీ నుంచి మేయర్ అభ్యర్దిగా బరిలోకి దించారు. ఇక.. పోలింగ్ రోజున ఊహించని పరిణామాలు చోటు చేసుకు న్నాయి. కొన్ని వార్డుల్లో రీ పోలింగ్ జరిగింది. కాగా.. కౌంటింగ్ లో తొలి నుంచి బీజేపీ అభ్యర్ది లీడ్ లో ఉన్నారు. మధ్యాహ్నం సమయం నుంచి వైసీపీ ఆధిక్యత కొనసాగింది. చివరి వరకు హోరా హోరీగా సాగిన ఆధిక్యతలు చివరకు వైసీపీ అభ్యర్దికే అనుకూలంగా ఫలితం వచ్చింది.

ఎట్టకేలకు వైసీపీ ఖాతాలో అనంతపురం
కాగా, తుది ఫలితంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి రమేష్ గౌడ్ తన సమీప బీజేపీ అభ్యర్థిపై 5,981 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) రమేష్ గౌడ్ విజయాన్ని అధికారికంగా ధ్రువీకరిస్తూ... పత్రాన్ని అందజేసింది. మొత్తం పోలైన మొత్తం ఓట్లు: 1,33,871 కాగా, వైఎస్సార్ సీపీ (రమేష్ గౌడ్): 62,219 ఓట్లు దక్కాయి. బీజేపీ అభ్యర్ధికి 56,238 ఓట్లు పోలయ్యాయి. కాగా.. 5 ,981 ఓట్ల మెజార్టీతో వైసీపీ విజయం సాధించింది. ఇక్కడ మొత్తం 62 డివిజన్లు ఉండగా.... టీడీపీ(31) అభ్యర్థులు ఎక్కువ డివిజన్లలో గెలిచారు. ఇక వైసీపీ అభ్యర్థులు 20 స్థానాల్లో, 6 చోట్ల జనసేన, ఒక్క స్థానంలో బీజేపీ అభ్యర్థి గెలిచారు. వైసీపీ విజయం సాధించిన ఏకైక మేయర్ స్థానం అనంతపురం. మిగిలిన అన్ని చోట్లా ప్రతికూల ఫలితాలు ఎదురైనప్పటికీ.... అనంతపురం కార్పొరేషన్‌ను నిలబెట్టుకోవడంతో వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్సాహం నెలకొంది. ఈ విజయం రాయలసీమ ప్రాంతంలో కీలకంగా మారనుంది. కాగా.. మరో మూడు మున్సిపాల్టీలను మాత్రమే వైసీపీ గెలుచుకుంది.













Click it and Unblock the Notifications
