ఏపీలో తుఫాన్ మిగిల్చిన నష్టం: కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ: అత్యవసరంగా

ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు తుఫాన్.. భారీ విధ్వంసాన్ని మిగిల్చింది. ఎడతెరిపి లేకుండా కురిసిన అతి భారీ వర్షాలు, 120 కిలోమీటర్లకు పైగా వేగంతో వీచిన ఈదురుగాలులు అనేక జిల్లాలను కకావికలం చేశాయి. వేలాది హెక్టార్లల్లో పంట నష్టం సంభవించింది. చేతికి అందిన పంట నీటిపాలైంది. తుఫాన్ వల్ల సంభవించిన నష్టంలో 95 శాతం వాటా ఒక్క వ్యవసాయానికి సంబంధించినదే. విద్యుత్ సరఫరా వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. భారీగా రోడ్లు దెబ్బతిన్నాయి.

అంతకుముందే ఏపీపై విరుచుకుపడింది.. ఆర్ణబ్ తుఫాన్. దాని నుంచి గట్టెక్కక ముందే మురసు కూడా ముంచెత్తడంతో ఏపీ ఉక్కిరిబిక్కిరికి గురైంది. ఈ రెండు తుఫాన్ల కారణంగా సంభవించిన నష్టాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. ప్రాథమిక అంచనాలను రూపొందించింది. దీన్ని కేంద్రానికి పంపించింది.

Andhra Pradesh Seeks Immediate Financial Aid After Murasu Cyclone CM Chandrababu letter to Centre

ఆర్ణబ్, మురసు తుఫాన్ల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు.. కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తుఫాను కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సంభవించిన పంట, ఆస్తి నష్టంతో పాటు ప్రజలకు కలిగిన ఇబ్బందులు, ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను ఇందులో వివరించారు. రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక సాయాన్ని తక్షణమే అందించాలని విజ్ఞప్తి చేశారు.

తుఫాన్ బలహీన పడింది గానీ..: ఏపీలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
తుఫాన్ బలహీన పడింది గానీ..: ఏపీలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

మురసు తుఫాను ప్రభావం గురించి ఫోన్ లో కూడా అమిత్ షా కు వివరించారాయన. ఒకే రోజు రెండుసార్లు అమిత్ షాతో ఫోన్‌లో మాట్లాడారు. వరుస తుఫాన్ల కారణంగా రాష్ట్రానికి ఎదురైన నష్టాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మురసు తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని ఎనిమిది శాఖలకు సంబంధించి ప్రాథమికంగా సుమారు రూ.343.95 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు. ఇందులో దాదాపు 94 శాతం నష్టం వ్యవసాయ రంగంలోనే ఉందని తెలిపారు.

స్థానిక ఎన్నికల ఫలితాలపై జగన్ సెటైరికల్ ట్వీట్
స్థానిక ఎన్నికల ఫలితాలపై జగన్ సెటైరికల్ ట్వీట్

రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో 465 గ్రామాల పరిధిలో 50,473 హెక్టార్లలో పంటలు దెబ్బ తిన్నాయని, 69,828 మంది రైతులు ప్రభావితం అయ్యారని పేర్కొన్నారు. వీటిలో 45,900 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లిందని, వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రాథమికంగా రూ. 324.22 కోట్ల నష్టం అంచనా వేసినట్లు చెప్పారు. బాపట్ల, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పంట నష్టం అధికంగా ఉందని, ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నాయని చెప్పారు.

తుఫాను ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ, అత్యవసర కార్యకలాపాల కేంద్రాలను అప్రమత్తం చేసినట్లు చంద్రబాబు తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, పునరావాస చర్యల కోసం 11 ఎస్‌డీఆర్ఎఫ్, 13 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ముందుగానే సిద్ధం చేశామని అమిత్ షాకు వివరించారు. ప్రభావిత జిల్లాల్లో 480 పాఠశాలలను పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేశామని, ఇప్పటివరకు 12,230 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు.

అంతకుముందు చంద్రబాబు తుఫాను ప్రభావంపై 12 జిల్లాలకు చెందిన జిల్లా కలెక్టర్లు, క్షేత్రస్థాయి సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ అనంతరం సహాయక చర్యల్లో నిమగ్నమైన 45,000 మందికి పైగా అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని అభినందించారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం పనిచేస్తున్నారని ప్రశంసించారు. వర్షాలు తగ్గేంత వరకూ జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+