వంగవీటి రాధా ఘన విజయం.. మెజార్టీ: ABV కి దక్కిన ఓట్లు, రెండో స్థానం..!!
వంగవీటి రాధ ఘన విజయం సాధించారు. హోరా హోరీగా సాగిన విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన వంగవీటి రాధాకు భారీ మెజార్టీ దక్కింది. ముఖ్యంగా ముగ్గురి మధ్య ప్రధాన పోటీ సాగింది. వైసీపీ నుంచి మాజీ మేయర్ భాగ్యలక్ష్మీ... ఇండి కూటమి మద్దతుతో మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వర రావు బరిలోకి దిగటం పోరు ఆసక్తిగా మారింది. కాగా.. తుది ఫలితాలు మాత్రం ఆసక్తిగా మారాయి.
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూటమి ఏకపక్షంగా విజయం దక్కిచుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 13 కార్పొరేషన్లలో ఎన్నికలు జరగ్గా.. 12చోట్ల కూటమి అభ్యర్థులు మేయర్లుగా విజయం సాధించారు. అనంతపురం కార్పొరేషన్ లో మాత్రం వైసీపీ జెండా ఎగిరింది. మూడు మున్సిపల్ స్థానాలు వైసీపీ కి దక్కాయి. కాగా.. విజయవాడ మేయర్ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని పెంచింది. అర్ద్రరాత్రి తరువాత ఇక్కడ ఫలితం అధికారికంగా ప్రకటించారు. తొలి నుంచి వంగవీటి రాధ ఆధిక్యత కొనసాగింది. పుట్టినరోజే రాధా మేయర్ స్థానాన్ని దక్కించుకోవటంతో స్థానిక జనసేన పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రభావం నామ మాత్రంగా మారింది. వంగవీటి రాధాకు మొత్తం 2,65,888 ఓట్లు రాగా.. 1,30,872 మెజార్టీ లభించింది.

మూడో స్థానంలో ఏబీ వేంకటేశ్వర రావు
కాగా, వైసీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మికి 1,35,016 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి ఏబీవీకి 12,642 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. తుది ఫలితం వరకు కూటమి అభ్యర్థి వంగవీటి రాధా తన పార్టీ శ్రేణులు, అనుచరులతో కలసి తన కార్యాలయంలోనే ఫలితాలను వీక్షించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత లెక్కింపు కేంద్రానికి చేరుకున్నారు. రిటర్నింగ్ అధికారి నుంచి గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఆ తరువాత అనుచరులతో కలసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాధా విజయంతో జనసేన పార్టీ శ్రేణులు పెద్దెత్తున సంబరాలు చేసుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్, వామ పక్షాల మద్దతు తో బరిలో నిలిచిన ఏబీ వెంకటేశ్వర రావుకు దక్కే మద్దతు పైన తొలి నుంచి అనేక రకాల చర్చలు సాగాయి. అయితే.. ఏబీ ఇప్పుడు మూడో స్థానంకు పరిమితం అయ్యారు.












Click it and Unblock the Notifications
