కూటమిని విమర్శిస్తే ఊరుకోను- అలాంటివి నాకు నచ్చవు: పిఠాపురానికి పిలవకండి
సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన సొంత నియోజకవర్గం కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటిస్తోన్నారు. ఓబీఎస్ మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణం వేదికగా పీఠికాపురం సంక్రాంతి మహోత్సవ వేడుకలు, పర్యాట శాఖ ఏర్పాటు చేసిన హస్తకళలు, చేనేత కళల స్టాల్స్ ను ఆయన ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. అనంతరం ఆయన ప్రసంగించారు.
పిఠాపురంలో ఈక రాలిపడినా అది పెద్ద వార్త అయిపోతోందని, తాటాకు చప్పుళ్లను కూడా వైరల్ చేస్తోన్నారని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఎవరో వచ్చి ఇక్కడ ప్రజల మధ్య సంబంధాలు చెడగొట్టాలని చూస్తున్నారని, ఇతర ఏ ప్రముఖ నాయకుల నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి పరిస్థితి లేదని అన్నారు. గత ప్రభుత్వ హయంలో పిఠాపురం నియోజకవర్గానికి ఎన్ని కోట్లు కేటాయించి పనులు చేశారో చూడాలని, తాను గెలిచాక తొలి సంవత్సరంలో 308 కోట్లరూపాయలను కేటాయించి ఈ మార్చి నాటికి పనులు కూడా పూర్తి చేసేలా అభివృద్ధి చేపట్టామని వివరించారు.

తాను ఇక్కడ ఉండటం కంటే కూడా పనులు పూర్తయ్యే వ్యవస్థ ఏర్పాటు చేయడం ముఖ్యమని పవన్ తెలిపారు. తాను ఉంటేనే, కలిస్తేనే పనులు అవుతాయంటే అది పరిపాలన వైఫల్యంగా భావిస్తానని తేల్చి చెప్పారు. సింగపూర్ తరహాలో ఓ వ్యక్తి మీద ఆధారపడకుండా వ్యవస్థ పనిచేసేలా పిఠాపురాన్ని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో నాయకులు ప్రజల మధ్య వైషమ్మ్యాలు పెట్టీ రాజకీయం చేశారని, ప్రభుత్వం మారినా వైఎస్ఆర్సీపీ నాయకుల్లో మార్పు రాలేదని, ప్రజలు అలాంటి వారి మాటలో పడి వివాదాల్లోకి వెళ్ళొద్దని సూచించారు.
పిఠాపురం నుండి గెలిచి జాతీయ స్థాయిలో జనసేన పేరు వినపడేలా పనిచేస్తున్నానని, తనను పిఠాపురానికే పరిమితం చేయొద్దని కోరారు. పేరంటాలు, ఫంక్షన్లకు అటెండ్ కావడం కంటే పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని పవన్ కల్యాణ్ వివరించారు. ఎక్కడా ఉన్నా తన గుండెల్లో పిఠాపురం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం ఇక్కడే జరుగుతుందని, పార్టీ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్ మంగళగిరి అయితే, ఐడియాలజికల్ హెడ్ క్వార్టర్స్ పిఠాపురాన్ని ప్రకటిస్తున్నానని అన్నారు.
పిఠాపురంలో ఇద్దరు చిన్నపిల్లలు మాట మాట అనుకుని కొట్టుకుంటే అది పెద్ద వార్త చేసి దానికి తాను బాధ్యుడినని విమర్శిస్తోన్నారని, పులివెందులలో సొంత బాబాయ్ హత్యకు గురైతే అది వార్త అవ్వదని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. నాయకులే కొట్టుకుంటుంటే స్కూల్లో ఇద్దరు పిల్లలు మాట మాట అనుకోకుండా ఉంటారా? అది కూడా పెద్ద గొడవలా మార్చాలని ప్రయత్నించారని, దానిలోకి కులాలను తీసుకొచారని ఆరోపించారు.
పిఠాపురంలో పోటీ చేస్తానని చెప్పగానే తనను ఓడించడానికి పులివెందుల, చిత్తూరు నుండి నాయకులు వచ్చి ఇక్కడ పని చేశారని విమర్శించారు. నల్గొండ ఫ్లోరోసిస్ లాంటి ఎన్నో సమస్యలు చూసి ప్రభావితమై రాజకీయాల్లోకి వచ్చానని, సినిమాలు ఫ్లాప్ అయినా డబ్బులు వచ్చే శక్తి ఉన్న స్టార్ డమ్ ఉన్న వ్యక్తినని, అలాంటిది రాజకీయాల్లోకి రావడానికి కారణం నా ఆవేదన, బాధ్యతేనని పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు.
ఉన్నత స్థాయి మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, ఫైన్ ఆర్ట్స్ శిక్షణ అందించేలా తన ట్రస్ట్ ద్వారా నిర్ణయం తీసుకున్నానని పవన్ తెలిపారు. ఎవరూ కూడా వ్యవస్థకు అతీతులం కాదని, కుల, మత, వర్గాల మధ్య విభజన చేయాలని, గొడవలు పెట్టాలని చూస్తే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నేను రూల్ బుక్ మాట్లాడుతాను, దానినే అమలు చేయమని అధికారులకు సూచిస్తానని తేల్చి చెప్పారు. పొత్తులను బలహీనం చేసేలా కూటమి నాయకులు మాట్లాడవద్దని, తనకు చంద్రబాబు మధ్య ఎలాంటి అభద్రత భావం లేదని అన్నారు.
-
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!












Click it and Unblock the Notifications