వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోనసీమ లాంటి గొడవలు కావాలనే-విడుదల చేసాకే: రెచ్చగొడుతున్నారు - పవన్..!!

|
Google Oneindia TeluguNews

విశాఖ కేంద్రంగా జనసేనాని పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అరెస్ట్ చేసిన తమ పార్టీ నేతలను విడుదల చేసిన తరువాతే జనవాణి నిర్వహిస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి లక్ష్యంగా పవన్ తీవ్ర విమర్శలు చేసారు. వైసీపీకి విశాఖలో శాంతి భద్రతలు ఉండకుండా.. రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మూడు రాజధానుల ప్రోగ్రాం కంటే మూడు నెలల ముందుగానే విశాఖలో జనవాణి ఖరారు చేసుకున్నామని పవన్ వివరించారు. వాళ్ల కార్యక్రమం భగ్నం చేయాలనే ఆలోచన చేయలేదన్నారు. మా పార్టీ కార్యక్రమానికి ఎలా వెళ్లాలో వైసీపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు.

Pawan Kalyan says hold Janavani only after the release of their party leaders who have been arrested

రాజు మారినప్పుడల్లా రాజధాని మారుతుందా
జనవాణికి ఎప్పుడూ ఇబ్బంది రాలేదన్నారు. వైసీపీ నుంచి బూతులు మినహా ప్రజా సమస్యల పైన ఆలోచన లేదని విమర్శించారు. ప్రభుత్వంతో ఎన్నికల వేళ పోటీ పెట్టుకుంటామన్నారు. పోలీసు అధికారులు జులం చూపించారని పవన్ ఆరోపించారు. వివేకా హత్య కేసును ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. పోలీసు శాఖ అంటే నమ్మకం లేని వ్యక్తి ఏపీ సీఎంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. తాము ఏమైనా సంఘ విద్రోహ కార్యక్రమాలు చేస్తున్నామా అని ప్రశ్నించారు. రాజధాని వికేంద్రీకరణ తప్ప..అధికార వికేంద్రీకరణ ఆలోచన వైసీపీకి లేదన్నారు. లేదన్నారు. అమరావతే రాజధానిగా డిసైడ్ అయ్యామని స్పష్టం చేసారు. 2014లో కర్నూలు - విశాఖ రాజధాని చేసి ఉంటే అదే రాజధానిగా అంగీకరించేవాళ్లమని చెప్పారు.

Pawan Kalyan says hold Janavani only after the release of their party leaders who have been arrested

మంత్రులకు అధికారాలు లేవు
ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధాని మారుతుందా అంటూ నిలదీసారు. రాయలసీమ పైన ప్రేమ ఉంటే ఎందుకు ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో ఎందుకు వెనుకబాటు తనం ఉందని నిలదీసారు. అధికార వికేంద్రీకరణ గురించి మాట్లాడే వైసీపీ.. ఒక వ్యక్తి వద్దే మొత్తం అధికారం ఉందని వ్యాఖ్యానించారు. మంత్రులకు అధికారాలు ఎక్కడ ఉన్నాయని పవన్ ప్రశ్నించారు. ఏ ఒక్క సబ్ ప్లాన్ కు నిధులు ఇవ్వలేదన్నారు. ఏ కార్పోరేషన్ కు ఫండ్స్ విడుదల చేయలేదని చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల నిధులు నిలుపుదల చేసారని..అక్కడ వికేంద్రీకరణ అవసరం లేదని విమర్శించారు. గొడవలు పెట్టటానికి వికేంద్రీకరణా అని ప్రశ్నించారు. ఒక్క వ్యక్తి నిర్ణయాల కారణంగా అనేక సంస్థలు ఏపీ నుంచి వెళ్లిపోయాయని పరోక్షంగా జగన్ ను ఉద్దేశించి పవన్ ఆరోపణలు చేసారు.

Pawan Kalyan says hold Janavani only after the release of their party leaders who have been arrested

ఒక్క వ్యక్తి నిర్ణయాలతో రాష్ట్రానికి నష్టం
రాష్ట్రంలో ఏం జరగాలో ఒక్క కుటుంబం నిర్ణయిస్తుందని..వీళ్లు అధికార వికేంద్రీకరణ గురించి మాట్లాతున్నారని వ్యాఖ్యానించారు. అన్ని ప్రాంతాలు - కులాలకు అధికారం ఏదని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉండి గర్జన ఏంటని పవన్ నిలదీసారు. అన్యాయం జరిగిన వాళ్లు గర్జన చేస్తారని చెప్పుకొచ్చారు. పోలీసు అధికారులు నన్ను రెచ్చగొట్టేలా వ్యవహరించారు. వైసీపీ బెదిరింపులకు భయపడేది లేదు. చాలా సార్లు బెదిరించారని చెప్పుకొచ్చారు. నాడు ముఖ్యమంత్రిని ఇదే సీఎం ఉరి తీయమంటే పోలీసులు పట్టించుకోలేదన్నారు. అనుమతి తీసుకొని ర్యాలీ చేస్తే..తమ పార్టీ నేతలను అరెస్ట్ చేసారని మండిపడ్డారు. నేటి సీఎం నాడు ఎంపీగా 2014లో ఎందుకు మాట్లాడలేదని నిలదీసారు. అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసారు. కోనసీమ లాంటి ఘటనలు వైసీపీ కోరుకుంటోందని పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అరెస్ట్ చేసిన పోలీసు స్టేషన్ కు వెళ్లాలా లేదా అనేది నిర్ణయిస్తామని చెప్పారు.

English summary
Janasena Chief Pawan Kalyan decided to hold Janavani After Realse the Party leaders who Aressted by Vizag police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X