గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ కళ్యాణే చెప్పారు ఇక ఆయనిష్టం, శివాజీ ఆధారాలిస్తే: నో చెప్పినా మళ్లీ చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

గుంటూరు: దేశంలో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్ కంటే బీజేపీయే ఎక్కున నష్టం చేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం మండిపడ్డారు. ఆయన గుంటూరులో, ఆ తర్వాత కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ తమతో కలిసి రావాలని మరోసారి సూచించారు.

థ్యాంక్స్!: జగన్ ధైర్యం పవన్ కళ్యాణ్! వైసీపీ-టీడీపీ సర్వేలో జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయంటే?థ్యాంక్స్!: జగన్ ధైర్యం పవన్ కళ్యాణ్! వైసీపీ-టీడీపీ సర్వేలో జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయంటే?

 ఎన్డీయే ఓడిపోవడం ఖాయం, కాంగ్రెస్‌పై ప్రశంసలు

ఎన్డీయే ఓడిపోవడం ఖాయం, కాంగ్రెస్‌పై ప్రశంసలు

ఏపీకి మోడీ నమ్మకం ద్రోహం చేశారన్నారు. విభజన తర్వాత లోటు బడ్జెట్‌ ఉందని, దానికి తోడు రాజధాని, పరిశ్రమలు లేవని, రాజధాని శంకుస్థాపనకు పిలిచి పునాది వేయమని ఆహ్వానిస్తే మోడీ వచ్చి గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్లు ఇచ్చారని మండిపడ్డారు. రావాల్సింది అడిగితే తన మీద ఎదురుదాడి చేసి పరిస్థితికి వచ్చారని, ఏటా కేంద్రానికి నాలుగైదు వేల కోట్లు పన్నులు కడుతున్నామని, ఏపీకి చేయూతనిస్తే గుజరాత్‌ రాష్ట్రాన్ని మించిపోతామని మోడీకి భయం పట్టుకుందన్నారు. ఈ మాత్రం నిలదొక్కుకున్నామంటే అది అధికారుల కష్టమేనన్నారు.దేశం మార్పు కోరుతోందని, ఈసారి ఎన్డీయే ఓడిపోవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ తెచ్చిన చట్టాన్ని బీజేపీ అమలు చేయలేదన్నారు.

పవన్ కళ్యాణే చెప్పారు, ఇక ఆయనిష్టం

పవన్ కళ్యాణే చెప్పారు, ఇక ఆయనిష్టం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కేంద్రం పైన పోరాటం చేయాలని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై పోరాటంలో జనసేనాని తమతో కలిసి రావాలని హితవు పలికారు. తాము ఒంటరిగా పోటీ చేస్తామని, టీడీపీతో కలవమని జనసేనాని చెప్పినా చంద్రబాబు మరోసారి ఆహ్వానం పలికారు. విభజన చట్టం ద్వారా న్యాయం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసిందని చంద్రబాబు చెప్పారు. పవన్ కళ్యాణ్ తాను వేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ద్వారా ఏపీకి కేంద్రం నుంచి రూ.72వేల కోట్లు రావాలని తేల్చాడని చంద్రబాబు గుర్తు చేశారు. ఇలాంటి సమయంలో కేంద్రంపై పోరాటంలో పవన్ కళ్యాణ్ తమతో కలిసి వస్తాడా లేదా పోరాటం చేస్తాడో ఆయన ఇష్టమని చెప్పారు.

శివాజీ ఆధారాలు ఇస్తే చర్యలు

శివాజీ ఆధారాలు ఇస్తే చర్యలు

సినీ నటుడు శివాజీ చెబుతున్నట్లుగా ఐఏఎస్ అధికారులు వ్యవహరిస్తే ఆధారాలు ఇవ్వాలని, చర్యలు తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు పైన ఇప్పటి వరకు 350 కేజీల రిపోర్ట్ పంపించామని చంద్రబాబు చెప్పారు. ప్రస్తుత మోడీ గవర్నమెంట్ కంటే గతంలోని కూటమి ప్రభుత్వాలు బాగా పని చేశాయని కితాబిచ్చారు. మోడీ ప్రభుత్వంలో అందరికీ అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు.

English summary
After floating his party in 2014, Pawan had teamed up with the TDP-BJP alliance and shared stage with Narendra Modi and Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X