మతి తప్పిన పాలకుల దాష్టీకాల నుంచి ప్రజలు భయటపడాలి: పవన్ కళ్యాణ్ దీపావళి శుభాకాంక్షలు

అమరావతి: ఓ వైపు దీపావళి శుభాకాంక్షలు చెబుతూనే.. మరోవైపు ఆంధ్రప్రదేశ్ సర్కారుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి విమర్శలు గుప్పించారు.
ప్రకృతి వైపరీత్యాలు, మతి తప్పిన పాలకుల దాష్టీకాల నుంచి ప్రజలు భయటపడాలని.. దీపావళి పండుగ సందర్భాన ఆ ఆదిశక్తిని ప్రార్థిస్తున్నాన్నారు పవన్‌ కళ్యాణ్‌.

భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పిన పవన్‌ కళ్యాణ్.. దీపం పరబ్రహ్మ స్వరూపమని.. అంధకారం నుంచి వెలుగు వైపు నడిపించేది దీపం అని భావిస్తామన్నారు. అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్ఠాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకొనే ఈ పండుగ తరుణాన తన తరపున, తన పార్టీ జనసేన తరపున శుభాకాంక్షలు తెలిపారు.

Pawan Kalyan slams AP govt: says Happy Diwali to people

పర్యావరణానికి నష్టం కలిగించకుండా ఈ దీపాల పండగను జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. కాంతులను వెదజల్లే దీపాలు, విద్యుల్లతలతో ఇళ్లను అలంకరించుకుందాం. ఎక్కువ లహానికరం కానీ మందుగుండు సామాగ్రితో దీపావళి జరుపుకోవడం సర్వదా శ్రేయస్కరం. కంటికి హాని చేసే క్రాకర్లకు దూరంగా ఉందాం. ముఖ్యంగా పిల్లలను దూరంగా ఉంచండి. ఈ దీపావళిని ఆనందకేళిగా మలుచుకోమని హృదయపూర్వకంగా కోరుతున్నాను అని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఏపీలో గంజాయి సాగుపై పవన్ కళ్యాణ్ ఏపీ సర్కారుపై మండిపడుతున్న విషయం తెలిసిందే. ప్రతి రాష్ట్రంలో పరిశ్రమలు అభివృద్ధి చెందుతుంటే.. వైసీపీ పాలనలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం గంజాయి సాగు అభివృద్ధి చెందుతుందని పవన్ కళ్యాణ్ మంగళవారం జరిగిన పార్టీ సమావేశంలో వ్యాఖ్యానించారు. అది ఎన్ని రెట్లు వృద్ధి చెందింది అనేది పోలీసులే చెప్పాలన్నారు.

ముంబై క్రూజ్ షిప్‌లో 15 గ్రాముల గంజాయి పక్కన ఉన్న వ్యక్తి దగ్గర దొరికిందని షారూక్ ఖాన్ గారు అబ్బాయిని 23 రోజులు జైల్లో పెట్టారు. అలాంటిది ఒక్కో సీజన్ కు 4 వేల టన్నుల గంజాయి సాగు చేస్తుంటే ఎంత మందిని జైల్లో పెట్టాలని ప్రశ్నించారు. విశాఖపట్నంలో మంగళవారం విజయనగరం జిల్లా నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ "ప్రస్తుతం ఏఓబీలో గంజాయి భారీగా సాగవుతోంది. దశాబ్దాల నుంచే గంజాయి సాగు ఉంది. ఇప్పుడు అది కొన్ని రెట్లు పెరిగిపోయింది. వైసీపీ నాయకులు మాట్లాడితే మేమే చేశామా.. తెలుగుదేశం హయాంలో కూడా సాగయ్యిందని చెబుతున్నారు. నేను గంజాయి సాగు గురించి మొదట మాట్లాడింది అప్పుడే. నిష్పక్షపాతంగా సమస్యను చూపడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి దానికీ మీరే కారణం అని మాత్రం అనను. నవతర్నాలు హామీ ఇచ్చి వందలో 15 మందికిచ్చి అదే అభివృద్ధి అని చెబితే దానికి కచ్చితంగా వైసీపీనే తప్పుబడతాను అని అన్నారు జనసేనాని.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+