పడతామబ్బా..! కానీ పారిపోను.. భజనపరున్ని కాను : పవన్
తిరుపతి : 2014 ఎన్నికల సమయంలో.. టీడీపీ బీజేపీలకు మద్దతునిచ్చిందుకు తనపై వచ్చిన ఆరోపణల పట్ల వ్యంగ్యంగా స్పందించారు పవన్ కళ్యాణ్. టీడీపీ బీజేపీలకు మద్దతు పలికినందుకు తనను ఆ పార్టీల తొత్తుగా కొంతమంది అభివర్ణిస్తున్నారని.. అయితే దానిపై తనకెలాంటి బాధలేదన్నారు పవన్.

తను ఏ పార్టీకి తొత్తును కాదని.. రైతులకు తొత్తునని, ఆడబిడ్డలకు తొత్తునని, అక్కా చెల్లెళ్లకు తొత్తునని ఆవేశంగా చెప్పారు పవన్. విమర్శించేవాళ్ల గురించి ప్రస్తావిస్తూ.. 'పడతామబ్బా.. కానీ పారిపోను. అలా అని నేనెవరకీ భజనపరున్ని కాను' అంటూ చెప్పారు పవన్. ఇక తనకెలాంటి కులాల పట్టింపుల్లేవని చెప్పిన పవన్.. మానవత్వం బాధపడుతున్నప్పుడు అండగా నిలబడే వ్యక్తులే నిజమైన హీరోలని తెలిపారు.












Click it and Unblock the Notifications