మధ్యలోనే షూటింగ్ నిలిపివేత: మరో బాంబు పేల్చిన పవన్ కళ్యాణ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ చట్టం నోటిఫికేషన్‌ను జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ తీవ్రంగా పరగిణిస్తున్నట్లు సమాచారం. ఈ నోటిఫికేషన్ జారీతో రైతులు ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో ఆయన పోరాటానికి సిద్ధమవుతన్నట్లు తెలుస్తోంది.
సినిమా షూటింగ్‌ను ఆయన మధ్యలోనే ఆపేసి హైదరాబాదుకు చెరుకున్నారు. రాజధాని నిర్మాణం పేరిట రైతుల వద్ద భూములను బలవంతంగా లాక్కుంటే సహించబోనని గతంలో పవన్ కళ్యాణ్ చెప్పారు. అంతేకాకుండా, భూసేకరణ చట్టం ప్రయోగిస్తే ఆందోళనకు దిగుతానని ఇటీవల తేల్చిచెప్పారు.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను అంతగా పట్టించుకోని ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉదయం ఐదు గ్రామాల పరిధిలో భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేమడాన్ని సీరియస్ గా పరిగణించిన పవన్ కల్యాణ్ తన షూటింగ్ ను అర్థాంతరంగా ముగించుకుని కొద్దిసేపటి క్రితం హైదరాబాదు చేరుకున్నారు.
నోటిఫికేషన్ జారీ అయిన గ్రామాల్లో ఆదివారంనాడు పర్యటించాలని ఆయన భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే విషయంపై ఆయన తన అనుచరులు, సన్నిహితులతో సమాలోచనలు చేస్తున్నట్లు సామాజిక మాద్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ మరో బాంబు పేల్చాడు. భూసేకరణకు వ్యతిరేకంగా ఆయన ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మాలనీ వ్యాఖ్యలను ఉటకించారు.












Click it and Unblock the Notifications