అసెంబ్లీకి జగన్ హాజరు వేళ పవన్ కీలక నిర్ణయం..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఈ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28న 2025-26 వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టనున్నారు. అసెంబ్లీకి జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో హాజరు కానున్నారు. గవర్నర్ ప్రసంగం వేళ నిరసనకు వైసీపీ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటు సభలో వ్యవహరించాల్సిన వైఖరి పైన పార్టీ ఎమ్మెల్యేలకు పవన్ దిశా నిర్దేశం చేసారు. జగన్.. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరవుతున్న అంశాన్ని ప్రస్తావించారు. కీలక నిర్ణయం తీసుకున్నారు.
పవన్ నిర్దేశం
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జనవరి 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు.. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. 25న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపను న్నారు. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను పిబ్రవరి 28వ తేదీన సభలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి పైన పార్టీ ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమావేశాల్లో అనుసరించాల్సిన విధి విధానాలు, పార్టీ విధానాల ను ఎమ్మెల్యేలకు పవన్ వివరించారు. ఇదే సమయంలో వైసీపీ సభకు హాజరవుతుండటంతో పార్టీ ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు చేసారు.

వైసీపీ ట్రాప్ లో పడవద్దు
వైసీపీ ట్రాప్ లో పడవద్దని పార్టీ ఎమ్మెల్యేలను పవన్ అప్రమత్తం చేసారు. ప్రజల గొంతుకను అ సెంబ్లీలో వినిపిద్దామని పార్టీ ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు. ప్రజల సమస్యలను, ఆకాంక్షలను చట్టసభల్లో చర్చిద్దామని వారికి సూచించారు. ఎమ్మెల్యేలు సభలో మాట్లాడే భాష హుందాగా ఉండాలన్నారు. పార్టీ తరఫున ఎన్నికైన ప్రతి శాసన సభ్యుడు, మండలి సభ్యులు చర్చల్లో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. శాసనసభ సంప్రదాయాన్ని, మర్యాదను కాపాడుతూ హుందాగా ముందుకు వెళ్లాలన్నారు. చట్ట సభలలో ఎంత విలువైన చర్చలు జరిగేవో ఒకసారి అందరూ పరిశీలించి.. అవగాహన పెంచుకోవాలని.. నియోజకవర్గాల సమస్యలను ప్రతీ ఎమ్మెల్యే ప్రస్తావించాలని నిర్దేశించారు.
పవన్ స్పష్టత ఇస్తారా
మాజీ సీఎం జగన్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. అందరూ కలిసి సభకు హాజరు కానున్నారు. గతంలో జగన్ కు మాజీ సీఎం హోదాలో ప్రత్యేకంగా వీఐపీ గేటు నుం చి అనుమతి ఇచ్చారు. ఇప్పుడు అలా అవకాశం ఇస్తారా లేదా అనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఇక, రాష్ట్రంలో చోటు చేసుకున్న తాజా పరిణామాల పైన సభలో చర్చించాలని ప్రభుత్వం భావి స్తోంది. ఈ చర్చల సమయంలో పవన్ తన అభిప్రాయాలను స్పష్టం చేసేందుకు సిద్దమవుతున్నా రు. ఈ రోజు జరిగే బీఏసీ సమావేశంలో జనసేన నుంచి ఏ అంశాల పై చర్చకు ప్రతిపాదనలు వస్తాయనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications