పవన్ నోట బీజేపీ డిమాండ్ ? సీబీఐ, ఈడీ దర్యాప్తు ! జగన్ టార్గెట్ గా ప్రధాని మోడీకి లేఖ..!

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ టీడీపీ-జనసేనతో కలిసి వెళ్లేందుకు బీజేపీ అడుగులు వేస్తోంది. ఈ విషయంలో బీజేపీని ఒప్పిస్తానన్న పవన్ ఆ మేరకు దారికి తెచ్చేశారు. ఈ క్రమంలో ఓ కీలక అంశంపై ఇవాళ ప్రధాని మోడీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాలు పాతవే అయినా ఇప్పటివరకూ వాటిని బీజేపీ నేతలు ఎక్కువగా ఫోకస్ చేశారు. కానీ ఇప్పుడు పవన్ కూడా అదే విషయాలను ప్రస్తావిస్తూ కేంద్ర సంస్ధలతో దర్యాప్తు కోరారు.

ఏపీలో 2019 జూన్ నుంచి ఇళ్ల స్ధలాల పంపిణీ, జగనన్న కాలనీల నిర్మాణం పేరుతో వైసీపీ ప్రభుత్వం వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని ఆరోపిస్తూ ఇవాళ పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఇందులో ఇళ్ల స్ధలాల పంపిణీ కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణలో రూ.35141 కోట్ల అక్రమాలు జరిగాయని పవన్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై అధికార వైసీపీ ప్రజాప్రతినిధే విజిలెన్స్ దర్యాప్తు కోరినట్లు పవన్ తెలిపారు. కానీ ప్రభుత్వం ఈ ఫిర్యాదును పట్టించుకోలేదన్నారు.

pawan kalyan urges pm modi for central agencies probe against ysrcp govts housing schemes

ఇళ్ల స్ధలాల కోసం సేకరించిన భూముల ధరల్ని ఎడాపెడా పెంచేసి భూములిచ్చిన యజమానులకు తక్కువ ధరలు చెల్లించి మిగతా డబ్బులు వైసీపీ నేతలు జేబుల్లో వేసుకున్నారని పవన్ ఆరోపించారు. ఈ మొత్తం ప్రాజెక్టు విలువే రూ.1.75 లక్షల కోట్లు ఉంటే ఈ ఏడాది అక్టోబర్ నాటికి 91 వేల కోట్లు చెల్లించినట్లు ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అమలు జరుగుతుంటే వైసీపీ ప్రభుత్వం మాత్రం ఇళ్ల పథకం తమదేనని చెప్పుకుంటోందన్నారు.

వైసీపీ ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా 30 లక్షల ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చిందని, ఇందులో భాగంగా రూరల్లో సెంటు, అర్బన్ ప్రాంతాల్లో సెంటున్నర చొప్పున 29.51 లక్షల మంది లబ్దిదారులకు వీటిని ఇవ్వాల్సి ఉందన్నారు. వీటిలో 21.87 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని, ఇందుకోసం 28,445 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇళ్ల స్ధలాలుగా మార్చారని, మరో 25374 ఎకరాల్ని ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించారన్నారు. ఈ గణాంకాల్లో ఎక్కడా పొంతనలేదన్నారు.

30 లక్షల ఇళ్లు కట్టిస్తామని చెబుతున్న జగన్ సర్కార్ జగనన్న లేఅవుట్లలో కేవలం 17 వేల ఇళ్లు మాత్రమే నిర్మించిందన్నారు. మిగతా చోట్ల 12 లక్షల ఇళ్లు కట్టిందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో వేల కోట్ల ప్రజాధనం వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఏమార్చి వైసీపీ సర్కార్ అమలు చేస్తున్న పథకాల వల్ల ఎంత ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందో తేల్చేందుకు కేంద్ర సంస్ధలతో దర్యాప్తు చేయించాలని పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+