పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారు: ఈసారి యాత్రపై సర్వత్రా ఆసక్తి!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేసిన తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారాయి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును కలిసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో టిడిపి, జనసేన పొత్తు (tdp janasena alliance)తో పోటీ చేస్తాయని రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా సంచలన ప్రకటన చేశారు.
వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేయాలని పవన్ కళ్యాణ్ (pawan kalyan) పిలుపునిచ్చారు. ఇక చంద్రబాబు కి బెయిల్ కూడా రాకుండా రిమాండ్ పొడిగిస్తున్న నేపథ్యంలో ఓవైపు నారా లోకేష్ పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వారాహి విజయ యాత్రను నిర్వహించాలని రెడీ అయ్యారు.

ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర (varahi vijayayatra)కు షెడ్యూల్ ఖరారైంది. నాలుగో విడత వారాహి విజయ యాత్రను పవన్ కళ్యాణ్ అక్టోబర్ ఒకటవ తేదీ నుండి ప్రారంభించనున్నారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ నుండి పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ జిల్లా నేతలతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించిన తర్వాత తొలిసారి పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి రానున్నారు. అక్టోబర్ ఒకటవతేదీ నుండి నాలుగో విడత వారాహి విజయయాత్ర (fourth phase varahi vijaya yatra) జరగనున్న నేపథ్యంలో తన వారాహి విజయ యాత్రలో పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నారు. ఏం చేయబోతున్నారు అన్నది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. టిడిపితో పొత్తు ప్రకటించిన తర్వాత జరుగుతున్న తొలిసారి యాత్ర ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
1వ తేదీ నుంచి నాలుగో విడత వారాహి విజయ యాత్ర#VarahiVijayaYatra pic.twitter.com/1jlPPpINoW
— JanaSena Party (@JanaSenaParty) September 25, 2023
పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రలో వైసిపి సర్కార్ ను, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అదే పంధా కొనసాగిస్తారని, ఇక పొత్తును అఫీషియల్ గా ప్రకటించిన నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు కూడా పవన్ కు మద్దతుగా నిలుస్తారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications