వైసీపీ విముక్త ఏపీ లక్ష్యం : మోదీ -చంద్రబాబు కలిశారు : ఎవరిని లోపల వేస్తారో - పవన్ ...!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో నిర్ణయంలో భాగంగా.. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా..అదే నినాదంతో పని చేస్తామని పవన్ ప్రకటించారు. అదే తమ పార్టీ నినాదమని తేల్చి చెప్పారు. వైసీపి వ్యతిరేక ఓటున చీలనివ్వనని మరోసారి స్పష్టం చేసారు. పొత్తుల పైన పవన్ మరోసారి వ్యాఖ్యలు చేసారు. వైసీపీ పాలన ఏపీకి హానికరమని చెప్పుకొచ్చారు. తాను బీజేపీ భాగస్వామినేనని.. టీడీపీతో కలుస్తామని చెప్పినా..చివరి వరకు ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉందన్నారు.
Recommended Video

ప్రధాని - చంద్రబాబు కలవటంతో
రాజకీయాలు ఆర్గానిక్ గా ఉంటాయని చెప్పారు. అసలు చంద్రబాబును ప్రధాని మోదీ రానీయటం లేదని చెప్పారని..కానీ, ఇప్పుడు ఇద్దరూ కలిసారని..వారు ఏం మాట్లాడుకున్నారో తెలియదని పవన్ చెప్పుకొచ్చారు. ఏపీలో నేతలకు సిగ్గు లేదంటూ పవన్ ధ్వజమెత్తారు. ఏపీకి ఇప్పటి వరకు రాజధాని లేకపోయినా ఎవరు మాట్లాడటం లేదని వ్యాఖ్యానించారు. మద్యం స్కాంలో వైసీపీ నేతలు ఉన్నారని..కేంద్ర మంత్రి ఠాకూర్ చెబుతున్నారని..ఎవరిని లోపల వేస్తారో చూడాలని పవన్ చెప్పుకొచ్చారు. ధర్మాన ప్రసాదరావు పాదయాత్రలో పది అడుగులు వేయాలంటూ పవన్ సెటైర్ వేసారు.

పొత్తుల విషయంలో రహస్యం లేదు
తనతో పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుందో రాపాక వర ప్రసాద్ ను అడిగితే చెబుతారని వ్యాఖ్యానించారు. పాదయాత్ర చేయాలంటే సాహసోపేతమేనని చెప్పారు. బీహార్ సీఎం నితీశ్.. మహారాష్ట్ర సీఎం షిండే పాదయాత్రలు చేసి సీఎంలు కాలేదని చెప్పారు. అమిత్ షా..జూ ఎన్టీఆర్ తో ఎందుకు భేటీ అయ్యారో తనకు తెలియదన్నారు. నాడు తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని కేసీఆర్ చెప్పారని, కానీ..కుటుంబంతో పాటుగా సోనియాను కలిసిన తరువాత నిర్ణయం మారిపోయిందని గుర్తు చేసారు. అందుకే..తాను తన పొత్తు వ్యూహాల పైన అప్పుడే నిర్ణయం తీసుకోలేనని వివరించారు. తమ పార్టీ ద్వారా నిర్లక్ష్యానికి గురైన బీసీలకు న్యాయం చేస్తామని చెప్పారు.

క్రమశిక్షణ ఉల్లంఘిస్తే బహిష్కరణే
పార్టీ నిర్మాణంలో ఉన్న లోపాలను సరి దిద్దుకోవటానికి సమయం కేటాయిస్తామని పేర్కొన్నారు. తన అధ్యక్షతన పార్టీలో క్రమశిక్షణా సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. తన పార్టీలో ఉంటూ వెన్నుపోటు పొడిచే కంటే..వారు బయటకు వెళ్లి నచ్చిన పార్టీలో చేరి తనను విమర్శిస్తే సంతోషిస్తానని పవన్ చెప్పకొచ్చారు. పార్టీలో ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘన..డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు వస్తే బహిష్కరణ తప్పదని స్పష్టం చేసారు. 12 ఏళ్లుగా పార్టీని పరువుతో నడుపుతున్నామని.. పార్టీకి నష్టం చేసే విధంగా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications