లోకేష్ కు పవన్ ఫ్యాన్స్ స్వాగతం - కీలక హామీ: జూ ఎన్టీఆర్ పై వ్యాఖ్యల వేళ..!!
పవన్ కల్యాన్ అభిమానులు లోకష్ పాదయాత్ర సమయంలో స్వాగతం పలుకుతూ బ్యానర్లు ఏర్పాటు చేసారు.
టీడీపీ నేత నారా లోకేష్ యువగళం యాత్ర కొనసాగుతోంది. నెల రోజుల యాత్ర ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కంటిన్యూ అవుతోంది. ఏపీలో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ లోకేష్ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ - జనసేన పొత్తు పైన రెండు పార్టీల నుంచి అధికారికంగా ప్రకటన లేదు. లోకేష్ పాదయాత్ర వేళ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అనూహ్యంగా పవన్ కల్యాన్ అభిమానులు లోకష్ పాదయాత్ర సమయంలో స్వాగతం పలుకుతూ బ్యానర్లు ఏర్పాటు చేసారు. చిరంజీవి - పవన్ పైన తన అభిప్రాయాలను స్పష్టం చేసిన లోకేష్..జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి ఆహ్వనిస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ సమయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు రాజకీయంగా ఆసక్తిని పెంచుతున్నాయి.

లోకేష్ పవన్ అభిమానుల మద్దతు
నారా లోకేష్ పాదయాత్రకు పవర స్టార్ అభిమానుల నుంచి మద్దతు లభించింది. తిరుచానూరు పరిధిలో యువగళం పాదయాత్ర సందర్భంగా పవన్ అభిమానులు లోకేష్ తో పాటుగా పవన్ ..చంద్రబాబు ఫొటోల లో యువగళం పాదయాత్రకు విచ్చేస్తున్న నారా లోకేష్ కు స్వాగతం అంటూ భారీ బ్యానర్ ఏర్పాటు చేసారు. లోకేష్ పాదయాత్ర ప్రారంభం నుంచి తన యాత్రతో పాటుగా పవన్ కల్యాణ్ ప్రారంభించే వారాహి యాత్ర గురించి ప్రస్తావిస్తున్నారు. తమ యాత్రను ఎవరూ అడ్డుకోలేరంటూ హెచ్చరిస్తున్నారు. టీడీపీ - జనసేన పొత్తు ఖాయమని చెబుతున్నా..అధికారికంగా ప్రకటన మాత్రం లేదు. ఈ సమయంలో పవన్ అభిమానులు నేరుగా లోకేష్ కు స్వాగతం పలుకుతూ బ్యానర్ ఏర్పాటు చేయటం రాజకీయంగా చర్చకు కారణమవుతోంది.

చిరంజీవి.. పవన్.. జూ ఎన్టీఆర్ పై లోకేష్ వ్యాఖ్యలు
యువగళంలో భాగంగా యువతలో లోకేష్ తిరుపతిలో సమావేశమయ్యారు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి పైన తనకు ఉన్న అభిమానం ఏంటనేది లోకేష్ బయట పెట్టారు. వాల్తేరు వీరయ్య సినిమా గురించి ప్రస్తావించారు. బాలయ్య మామయ్య గురించి వివరించారు. ఇక పవన్ కల్యాణ్ మంచి మనసు ఉన్న వారని పేర్కొన్నారు. పవన్ మంచి మనసు ఉన్న వ్యక్తిగా తాను 2014లోనే గుర్తించానని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావటం గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రం..భవిష్యత్ కోసం రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీలోకి లోకేష్ ఆహ్వానించటం పైన రాజకీయంగా విమర్శలు వినిపించాయి. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావటం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న టీడీపీ అందిరనీ కలుపుకొని పోయే విధంగా కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తోంది.













Click it and Unblock the Notifications