గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కామన్వెల్త్‌లో స్వర్ణం సాధించిన తెలుగు యువకుడికి పవన్ కళ్యాణ్ రూ.10 లక్షల చెక్కు!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కామన్‌వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన గుంటూరు వెంకట్ రాహుల్ రాగాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూ.10 లక్షల చెక్కు ఇవ్వనున్నారు. ఈ మేరకు జనసేన అధినేత జనసేనాని ట్వీట్ చేశారు.

స్వర్ణం సాధించినందుకు వెంకట్ రాహుల్ రాగాలకు హృదయపూర్వక అభినందనలు అని, ఈ పతకం సాధించి మాతృభూణి భారత్‌కు గర్వకారణం అయ్యారని, ఆయనకు జనసేన పార్టీ తరఫున రూ.10 లక్షల చెక్కు ఇస్తామని వెల్లడించారు. ఆయనకు పార్టీ సెల్యూట్ చేస్తోందన్నారు.

కామన్వెల్త్‌ గేమ్స్: స్వర్ణం నెగ్గిన తెలుగబ్బాయి వెంకట్ రాహుల్

కాగా, ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టర్లు సత్తా చాటుతోన్న విషయం తెలిసిందే. శనివారం పోటీల్లో భాగంగా పురుషుల వెయిట్‌ లిఫ్టింగ్‌ 85 కేజీల విభాగంలో తెలుగువాడైన వెంకట్‌ రాహుల్‌ రాగల స్వర్ణం సాధించాడు.

మొత్తం 338 కేజీలను ఎత్తిన వెంకట్‌ రాహుల్‌ స్వర్ణం సాధించాడు. క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 187 కేజీలు ఎత్తిన రాహుల్‌ స్నాచ్‌లో 151 కేజీలు ఎత్తి స్వర్ణం దక్కించుకున్నాడు. వెంకట్ రాహుల్‌ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందినవాడు.

English summary
Heartfelt congratulations to“ Sri Venkat Rahul Ragala. “From JSP we will give him a ₹10 lakh cheque for achieving Goldmedal in common wealth games & making our Mother Land “Bharath” proud. We truly take pride in your outstanding achievement & JSP salutes you. Jai Hind!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X