Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇదే సరైన సమయం, అలా చేస్తే లక్ష్యం నెరవేరుతోంది, పవన్ స్పందిస్తారా?

హైదరాబాద్: ఏపీ రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన నిధులను లెక్క తేల్చింది జెఎప్‌సి. అయితే రాష్ట్రానికి న్యాయం కోసం పోరాటం చేసేందుకు ఇదే సమయమని జనసేన కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు ఈ మేరకు పోరాటం చేయాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ను కోరుతున్నారు. పార్టీ కార్యాలయానికి మేసేజ్‌లు పంపతున్నారు. అయితే కార్యకర్తల నుండి వస్తున్న సమాచారాన్ని ఆధారంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మరోసారి మీడియా సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Recommended Video

    Pawan Kalyan's JFC Final Report On Centre's Aid To AP

    కేంద్రం నుండి ఏపీ రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో ఉపేక్షించవద్దని జనసేన కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం నుండి ఏపీ రాష్ట్రానికి ఏ మేరకు నిధులు రావాల్సి ఉందనే విషయాన్ని జెఎఫ్‌సి శనివారం నాడు బయటపెట్టింది.

    ఏపీకి ఇచ్చిన హమీలను కేంద్రం నెరవేర్చాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఏ రకమైన పోరాట వ్యూహన్ని రూపొందిస్తారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

    ఇదే సరైన సమయమంటున్న జనసేన కార్యకర్తలు

    ఇదే సరైన సమయమంటున్న జనసేన కార్యకర్తలు

    ఏపీ రాష్ట్రంలో రాజకీయంగా బలపడేందుకు ఇదే సరైన సమయమని జనసేన పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం నుండి రాష్ట్రానికి ఏ మేరకు నిధులు రావాలనే విషయమై జెఎఫ్‌సి నివేదికను విడుదల చేసింది.ఈ తరుణంలోనే ఏపీకి న్యాయం చేయాలనే డిమాండ్‌తో పోరాటం చేస్తే ప్రయోజనం ఉంటుందని జనసేన పార్టీ కార్యర్తలు అభిప్రాయపడుతున్నారు.

    జనసేన కార్యకర్తల నుండి మేసేజ్‌లు

    జనసేన కార్యకర్తల నుండి మేసేజ్‌లు

    జనసేన కార్యకర్తల నుండి ఆదివారం ఉదయం నుండి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి మేసేజ్‌లు వస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై పోరాటం చేసేందుకు ఇదే సరైన సమయమని పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్‌కు మేసేజ్‌లు పంపతున్నారు.పోరాటాన్ని ప్రారంభించాలని కోరుతున్నారు. తామంతా అండగా ఉంటామని జనసేన కార్యకర్తలు హమీ ఇస్తున్నారు.

    జనసేన కార్యాలయం వద్ద సందడి

    జనసేన కార్యాలయం వద్ద సందడి

    ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా క్షేత్రస్థాయిలో ఉద్యమాన్ని వెంటనే ప్రకటించి రంగంలోకి దిగాలని పవన్ కల్యాణ్ పై ఒత్తిడి పెరుగుతోంది. ప్రత్యేక హోదాపై ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి, జనంలోకి వెళ్లేందుకు ఇదే సరైన సమయమని పవన్ అభిమానులు నినదిస్తున్నారు. ఈ మేరకు భారీ ఎత్తున జనసేన అభిమానులు హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయానికి వచ్చి పవన్ కల్యాణ్ ను కలుస్తున్నారు.

    పవన్ స్పందించే అవకాశం

    పవన్ స్పందించే అవకాశం

    జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఈ విషయమై స్పందించే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జెఎప్‌సి నివేదిక ఆధారంగా పోరాటం చేయాలని జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్‌పై ఒత్తిడి తెస్తున్నారు.ఏపీ ప్రయోజనాల కోసం ఏ రకమైన కార్యాచారణ తీసుకోవాలనే దానిపై పవన్ కళ్యాణ్ స్పందించే అవకాశం లేకపోలేదని నేతలు అభిప్రాయపడుతున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+