పిఠాపురంలో మారిపోయిన్ సీన్..పవన్ కల్యాణ్‌పై తగ్గిపోయిన బెట్టింగ్స్
ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 175 ఎమ్మెల్యే స్థానాలకు, 25 పార్లమెంట్ స్థానాలకు ఈ నెల 13న ఎన్నికలు జరిగాయి. నేతల జాతకం ఈవీఎం మిషన్లలో నిక్షిప్తం అయ్యాయి. గెలుపుపై ఇరు వర్గాలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ సొంత గ్రామాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపించడంతో ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. ఏపీలో దాదాపు 81 శాతం ఓటింగ్ జరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఇది ఎక్కువే. గత ఎన్నికల్లో 79.8 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సరళిని బట్టి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందో అని నేతలు సైతం ఆందోళనకు గురవుతున్నారు.
ఇక గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్..ఈసారి పిఠాపురం నుంచి బరిలో దిగారు.ఈసారి ఎలాగైనా గెలిచి చట్ట సభల్లో అడుగుపెట్టడానికి పవన్ కల్యాణ్ చేయని ప్రయత్నం లేదు. దాదాపు తొంబై వేలకు పైగానే కాపు ఓటర్లు నియోజకర్గంలో ఉండటంతో పవన్ అక్కడ నుంచి పోటీ నుంచి పోటీ చూశారు. పవన్ కల్యాణ్ కోసం తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా కదిలొచ్చి ఆయన కోసం ప్రచారం చేయడం జరిగింది. టీడీపీ శ్రేణులు కూడా సహకరించడంతో పవన్ గెలుపు ఈజీగా అని అంతా భావిస్తున్నారు. పోలింగ్ సరళని చూసిన తర్వాత పవన్ కల్యాణ్‌కు మెజార్టీ ఎంత అనే దానిపైనే చర్చ సాగుతోంది. అయితే పిఠాపురంలో ఆయన గెలుపు అంత సులువు కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

పోలింగ్ తర్వాత రెండు రోజులు లక్ష మెజార్టీ అన్న జనసేన , టీడీపీ నేతలు..ఇప్పుడు 10 నుంచి 20 వేలు మెజార్టీ వస్తుందని చెప్పడం సంచలనంగా మారింది. బూత్‌ల వారిగా ఓట్ల లేక్కలు చూసిన తర్వాత పవన్ గెలిస్తే చాలు అనే అభిప్రాయానికి నేతలు వచ్చినట్టు సమాచారం అందుతోంది. అధికార వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉండటంతో ఓట్లలో భారీగా చీలికలు వచ్చినట్టుగా తెలుస్తోంది. పిఠాపురంలో ఆమె ఒకసారి ఎమ్మెల్యేగా పని చేసి ఉండటం, స్థానికురాలు కావడం వంగా గీతకు కలిసి వచ్చినట్టుగా లెక్కలు చెబుతున్నాయి.
పిఠాపురంలో మొత్తం తొంబై వేల దాకా కాపులు ఉంటే యూత్ ఓట్లు అన్నీ దాదాపుగా పవన్‌కే పడినట్లు తెలుస్తోంది. ఇక మధ్య వయస్సు , మహిళల ఓట్లు మాత్రం కచ్చితంగా వంగా గీతకే మద్దతు నిలిచినట్టు తెలుస్తోంది. ఇలా కాపుల ఓట్లలో వయోభేదంతో పెద్ద చీలిక వస్తోంది. మిగిలిన కులాలలో ఎస్సీలు, బీసీలు మైనారిటీలలో మాత్రం అధిక శాతం ఓట్లు తమకే పడతాయని వైసీపీ లెక్కలు వేసుకుంటోంది. నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల 32 వేల ఓట్లలో లక్షా ఎనభై వేలు ఓట్లు ఉండగా,కచ్చితంగా లక్షపైన ఓట్లు గీతకు వస్తాయని వైసీపీ బల్ల గుద్ది చెబుతోంది. పైకి జనసేన కనిపిస్తున్నప్పటికి గ్రౌండ్ లేవల్ మాత్రం దానికి విరుద్దంగా ఉన్నట్టు కనిపిస్తోంది. పోలింగ్‌కు ముందు వరకు కూడా పిఠాపురంలో లక్ష మెజార్టీ అన్న నేతలు, కార్యకర్తలు, ఇప్పుడు 10 నుంచి 20 వేలు మాత్రమే మెజార్టీ వస్తుందని పందేలు కాసే వరకు వచ్చింది పరిస్థితి. మరి పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయం సాధిస్తారో లేదో తెలియాలంటే జూన్ 4న వరకు వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications