జనవాణి రూపకర్తకు పవన్ సీటు ఖరారు -జనసేనకు ముఖ్య నేత గుడ్ బై..!!
జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్దుల పై పవన్ క్లారిటీ ఇస్తున్నారు. పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. తొలి జాబితాలో అయిదుగురును ప్రకటించిన పవన్ ఆ తరువాత ఒక్కొక్కరిగా ఖరారు చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయనున్నారు. తాజాగా రాజోలు నుంచి అభ్యర్దిని ప్రకటించారు. దీంతో, అక్కడ సీటు ఆశించిన మరో సీనియర్ నేత పార్టీ వీడేందుకు సిద్దమవుతున్నారు.
రాజోలు అభ్యర్ది ప్రకటన : జనసేన నుంచి మరో అభ్యర్దిని పవన్ ప్రకటించారు. రాజోలు నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ పేరు ఖరారు చేసారు. పార్టీ వ్యవహారాల్లోనూ..నియోజకవర్గంలో వర ప్రసాద్ కొంత కాలంగా యాక్టివ్ గా పని చేస్తున్నారు. పార్టీ కార్యాలయంలో పవన్ తో ఆయన సమావేశమయ్యారు. రాజోలు నియోజకవర్గ పరిస్థితులపై చర్చించారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రణాళికాబద్ధంగా అనుసరించాల్సిన విధానాలను పవన్ వారికి వివరించారు. పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గంలో మళ్లీ జనసేన జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

వరప్రసాద్ కు సీటు ఖరారు : గత ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపించిన ఆ నియోజకవర్గ ఓటర్లు నాడు చూపించిన ఆదరణను ఈసారి మరింత పొందాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రాజోలు ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టు కుంటామని మాటిచ్చారు.గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున రాపాక వరప్రసాద్ ఒక్కరే గెలిచారు. రాజోలు స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన రాపాక వైసీపీకి దగ్గరయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో రాపాక వైసీపీ నుంచి అమలాపురం ఎంపీగా బరిలో నిలిచారు. వైసీపీ నుంచి టీడీపీ మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు రాజోలు ఎమ్మెల్యే అభ్యర్దిగా పోటీ చేస్తున్నారు.

రాజేశ్వర రావు ఆగ్రహం : ఇక, ఇప్పుడు వర ప్రసాద్ కు సీటు ివ్వటం పైన బొంతు రాజేశ్వరరావు ఆగ్రహంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన రాజేశ్వర రావు 814 ఓట్ల తేడాతో ఓడిపోయారు. జనసేన నుంచ గెలిచిన రాపాక వైసీపీకి దగ్గర కావటంతో, బొంతు జనసేనలో చేరారు. తనకే సీటు వస్తుందని ఆశించారు. కొంత కాలంగా నియోజకవర్గంలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరో వైపు వరప్రసాద్ నియోజకవర్గంలో జనవాణి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పవన్ నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమాల రూపకర్త కూడా ఆయనే. దీంతో, పవన్ ఆయనకే రాజోలు సీటు కేటాయించారు. ఇప్పుడు తన అనుచర వర్గంతో సమావేశం ఏర్పాటు చేసిన రాజేశ్వరరావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
ఉస్తాద్‌కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications