కాకినాడ డాక్టర్ కు పాదాభివందనం చేసిన పవన్, ఎందుకు?

కాకినాడ : పవన్ కళ్యాణ్ ఓ డాక్టర్ కాళ్లకు పాదాభివందనం చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం కాకినాడలోనే ఉన్న పవన్.. ఈ ఉదయం స్థానిక కిరణ్ కంటి ఆసుపత్రిని సందర్శించి ఓ రోగిని పరామర్శించారు.

ఈ సందర్బంగా.. ఆసుపత్రి వైద్యుడు సంకురాత్రి చంద్రశేఖర్‌ తో కాసేపు ముచ్చటించిన పవన్ తొలుత ఆయన కాళ్లకు పాదాభివందనం చేశారు. పవన్ చర్యకు చుట్టూ ఉన్నవాళ్లంతా ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. అనంతరం డాక్టర్ చంద్రశేఖర్ వ్యక్తిత్వంపై పలు ప్రశంసపూర్వక వ్యాఖ్యలు చేశారు పవన్.

Pawan touched Doctor chandrasekhar foor in kakinada eye hospital

జీవితంలో భార్య బిడ్డలను కోల్పోయినా.. మానసిక స్థైర్యంతో ఎంతోమందికి కంటికి చూపును ప్రసాదించిన వ్యక్తి డాక్టర్ చంద్రశేఖర్ అని కొనియాడారు పవన్. నిరాశ నుంచి ఎంతోమంది ఆశగా మారిన వ్యక్తి చంద్రశేఖర్ అని పవన్ అన్నారు. ఓ డాక్టర్ కు పవన్ పాదాభివందనం చేయడం పట్ల ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్ ఎలాంటి అహంభావం లేని వ్యక్తి అని అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+