కటీఫ్‌కు పవన్ కళ్యాణ్ వ్యూహం?: రంగంలోకి దిగిన చంద్రబాబు
విజయవాడ: తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకోవడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధపడినట్లు ప్రచారం సాగుతోంది. వ్యూహాత్మకంగా టిడిపి దూరం కావాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఆయన టిడిపిపై ట్విట్టర్ సమరం సాగిస్తున్నట్లు చెబుతున్నారు. తాజాగా, శనివారంనాడు కూడా టిడిపి భూసేకరణ విధానంపై ఆయన యుద్ధం ప్రకటించారు.
ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ మాటలను ఉటంకిస్తూ ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వ భూసేకరణ విధానాన్ని గట్టిగా వ్యతిరేరించడానికి నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఈ సమరం ద్వారా రాజకీయంగా తాను బలోపేతం కావడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్లు కూడా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఉద్దేశం అర్థం కావడంతో సంబంధాలు తెగిపోకుండా చూసుకోవడానికి చంద్రబాబు రంగంలోకి దిగారని అంటున్నారు.
ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం నాడు ఆయన స్వయంగా పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. విజయవాడ నుంచే పరిపాలన సాగిస్తున్న చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి హైదరాబాద్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

కాగా, పవన్ కళ్యాణ్ కూడా సర్దార్ చిత్రం షూటింగుకు ప్యాకప్ చెప్పి హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు. వీరిరువురూ ఆదివారం నాడు భేటీ కానున్నట్లు సమాచారం. ఈ భేటీలో ప్రభుత్వం ఏ పరిస్థితుల్లో భూ సేకరణ చట్టం ప్రయోగించాల్సి వచ్చిందనే అంశంపై పవన్ కల్యాణ్ కు చంద్రబాబు వివరిస్తారని తెలుస్తోంది.
ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తొలి విడతలో 5 గ్రామాల్లో 11 ఎకరాల భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసిన నేపధ్యంలో మిగిలిన గ్రామాల్లో కూడా ఈ తంతు పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ రైతులకు మద్దతుగా గ్రామాల్లో పర్యటిస్తూ, ఒకవేళ దీక్షకు దిగితే సమస్య మరింత జఠిలమయ్యే అవకాశం ఉంది.
పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతాల్లో పర్యటిస్తే సంభవించే ముప్పును చంద్రబాబు గ్రహించారని అంటున్నారు. దీంతో నేరుగా తానే స్వయంగా పవన్ కళ్యాణ్‌తో మాట్లాడి పరిస్థితిని సర్దుబాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు.
కాగా, పవన్ కళ్యాణ్ ఆదివారంనాడు ఏపీ రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. తెలుగుదేశం పార్టీ వైఖరిపై ఆ పార్టీ నాయకుల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్ మరోసారి రాజధాని ప్రాంతంలో పర్యటనకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా భూసేకరణకు రైతులు వ్యతిరేకంగా ఉన్న పెనుమాకలో ఆయన పర్యటించనున్నారు.
పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు ఇప్పటికే తన అనుచరులను పవన్ పంపారు. అయితే రాజధాని ప్రాంతంలో పర్యటనకు ముందు హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అవుతారు. భూసేకరణపై తన అభిప్రాయాన్ని స్వయంగా స్పష్టం చేయడంతో పాటు దీనిపై ప్రభుత్వ వైఖరి తెలుసుకుంటారు. ఆ తర్వాత భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులకు అండగా నిలిచేందుకు చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై పవన్ కల్యాణ్ తగిన నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
-
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications