మగాడిలా కొన్నా, నువ్వూ మగాడివైతే రా!, నీది ఓ బతుకేనా: జగన్‌పై పయ్యావుల

విజయవాడ: తన పైన ఆరోపణలు చేసిన వైసిపి నేతలు, ఆ పార్టీ అధినేత జగన్, ఆయన పత్రిక సాక్షి పైన టిడిపి నేత పయ్యావుల కేశవ్ గురువారం నాడు విరుచుకు పడ్డారు. జగన్‌ది బినామీ బతుకు అని, తాను అతనిలా బినామీ పేర్ల మీద ఆస్తులు కొనలేదని, మగాడిలా ఆస్తులు కొన్నానని వ్యాఖ్యానించారు.

జగన్‌ది బినామీ బతుకు

జగన్ కూడా మగాడైతే, ఆయన ఒంట్లో రాయలసీమ రక్తమే ఉంటే, బినామీ బతుకు కాకుంటే... రాజధాని నడిబొడ్డున తనతో చర్చకు రావాలని సవాల్ చేశారు. జగన్ ఉండే ఇల్లు కూడా ఆయన పేరు మీద లేదన్నారు. జగన్ ఉండే లోటస్ పాండ్, సాక్షి పత్రిక.. ఇలా అన్నీ బినామీయే అన్నారు. జగన్ బతుకే బినామీ అన్నారు.

Also Read: ఏం జరిగినా నేనేనా, జగన్‌కు ఇరిటేషన్.. దమ్ముంటే రా: లోకేష్ సవాల్

మగాడివే అయితే..

జగన్‌లో రాయలసీమ రక్తం ఉంటే, జగన్ నువ్వు మగాడివే అయితే ప్రకాశం బ్యారేజీ మీద చర్చకు రా.. అన్నారు. అక్కడ నీ మూడు తరాల ఆస్తులు, నా మూడు తరాల ఆస్తుల మీద చర్చలు జరుపుదామన్నారు. జగన్ అవినీతి ఆలోచనలను తమ పైన రుద్దవద్దన్నారు.

Payyavula challenges YS Jagan over YSRCP land scam allegations

నేను మగాడిలో రాజధాని ప్రాంతంలో భూములు కొన్నానని చెప్పారు. జగన్‌లా బినామీ పేర్లతో కొనలేదన్నారు. 2009లో, 2014లో కొన్న కార్లు కూడా తనవి అని చెప్పుకోలేని బతుకు జగన్‌ది అన్నారు. నీలా బినామీ పేర్లతో కొనలేదని, సొంతగా మగాడిలో కొన్నానని చెప్పారు.

సొంత కార్లలో తిరగాలన్నా జగన్ భయభయంగా తిరుగుతారని ఎద్దేవా చేశారు. జగన్ శాసన సభకు తన ఆస్తుల చిట్టా ఇచ్చారని, అందులో నాలుగు విషయాలు తప్ప ఏం లేవన్నారు. కలుగులో దొరికిన దొంగలా దొరికిన తర్వాత కొన్ని అంశాలను జోడించాడని చెప్పారు. అందుకే ఇప్పుడు కొన్ని ఆస్తులు తనవని చెప్పుకుంటున్నాడన్నారు.

సిబిఐ పరిధిలోకి రానివీ..

జగన్ పేరుతో బినామీ మైనింగ్ ఉందన్నారు. వాటన్నింటినీ బయటకు తీసుకు వస్తామని చెప్పారు. సిబిఐ పరిధిలోకి రాని అన్నింటిని ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన లోటస్ పాండు.. అదే జగన్ మహల్ అని, అది కూడా ఆయన పేరు మీద లేదని ఎద్దేవా చేశారు.

జగన్ ఏం వ్యాపారం చేసి ఇంత సంపాదించాడో చెప్పాలని నిలదీశారు. నేను మరోసారి చెబుతున్నా... నీవు మగాడివే అయితే, దమ్ముంటే, రాయలసీమ రక్తం ఉంటే రాజధానిలో చర్చకు రా.. అంటూ పయ్యావుల ఊగిపోయారు. తాను భూములు కొన్న దొనకొండ వద్ద రాజధాని రాలేదని జగన్ ఆవేదన అన్నారు.

జగన్ బినామీల పేర్లు చెబుతాం, రేపటి నుంచి సాక్షి ఆరోపణలపై వివరణ

నీది దౌర్భాగ్యపు బతుకు, నీది ఓ బతుకేనా, ఇతరుల మీద ఆరోపణలు చేస్తే భరించేది లేదని మండిపడ్డారు. జగన్ బినామీల పేర్లు అన్నీ జనం ముందుకు తెస్తామని చెప్పారు. జగన్ గురించి ఎన్నో అంశాలను ఇక వెలుగులోకి తెస్తామన్నారు. జగన్ బినామీల పేర్లు అన్నీ బయటకు తీస్తామన్నారు.

మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావుల మీద వైసిపి నేతలు చేసిన ఆరోపణలకు రేపటి నుంచి వివరంగా చెబుతామన్నారు. ఇప్పుడు మేం ఏం చెప్పినా వారికి అది హెడ్డింగ్ అవుతుందని, రేపటి నుంచి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

ప్రజా రాజధాని రావడం జగన్‌కు ఏమాత్రం ఇష్టం లేదని పయ్యావుల అన్నారు. నేను నా కొడుకు పేరుమీద ఆస్తులు కొన్నానని చెప్పారు. తమకు కక్ష సాధింపు ఇష్టం లేకే ఇన్నాళ్లూ ఊరుకున్నామని, ఇక నుంచి ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+