ప్రజల దృష్టి మళ్లించేందుకే విశాఖ రాజధాని ప్రకటన అన్న పయ్యావుల కేశవ్
విశాఖపట్నానికి షిఫ్ట్ అవుతున్నానంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటన వెనక అనేక కారణాలున్నాయని తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ వేగం పెంచిందని, దీన్ని డైవర్ట్ చేయడానికి ఉన్నపళంగా విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించారని ఆరోపించారు. వివేకా హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి సెల్ ఫోన్ లో ఎవరెవరితో మాట్లాడారు అనే అంశమే ఇప్పుడు కీలకంగా మారబోతోందన్నారు. ఆ కాల్ డేటా వివరాలు వెలుగులోకి రాకుండా ఉండేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు విశాఖ రాజధానిపై ప్రకటన చేశారని పయ్యావుల అభిప్రాయపడ్డారు. ఏపీ రాజధాని అమరావతి అంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిందని, దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా, అది పెండింగ్ లో ఉందన్నారు. ముఖ్యమంత్రి చేసిన ప్రకటన కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. రానున్న రోజుల్లో విశాఖ రాజధాని కాబోతోందని, తాను కూడా అక్కడకు షిఫ్ట్ అవుతున్నానని ఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రకటించారు. అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు అందరినీ ఆహ్వానిస్తున్నానన్నారు. కర్నూలు న్యాయ రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా ఉంటాయన్నారు.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిని రాజధానిగా ప్రకటించారు. గుంటూరు-విజయవాడ మధ్య ఉన్న ప్రాంతం కావడంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలవారికి సమదూరంలో ఉంటుందని దీన్ని నిర్ణయించారు. 2019లో ఎన్నికలు జరిగి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరునెలల తర్వాత మూడు రాజధానులంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. అప్పటి నుంచి ఈ అంశంపై రాష్ట్రంలోని రాజకీయ పార్టీల మధ్య పోరు నడుస్తోంది.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications