చాలా పేర్లు వస్తాయి: జానాXపయ్యావుల, పల్లె సవాల్
హైదరాబాద్: అసెంబ్లీలో ఉన్న మూడు వందల మంది గురించి మాట్లాడుకునేందుక సభ లేదని సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ గురువారం అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పైన పల్లె రఘునాథ్ రెడ్డి వ్యాఖ్యానించడంతో గందరగోళం ఏర్పడి వాయిదా పడిన సభ తిరిగి సమావేశమైంది.
ఈ సందర్భంగా పయ్యావుల మాట్లాడారు. తాము ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గురించి మాత్రమే మాట్లాడలేదన్నారు. సీమాంధ్ర ప్రజల ఆవేదన చెప్పే అవకాశం తమకు ఇవ్వాలన్నారు. మూడు వందల మంది సభ్యుల గురించి కాకుండా తొమ్మిది కోట్ల మంది ప్రజల ఆవేదన చెప్పేందుకు ఈ సభ ఉందన్నారు. జరిగిన నష్టం చెప్పుకునే హక్కును తమకు సభ కల్పించిందన్నారు. తమ అభిప్రాయాలు చెప్పుకునే హక్కు ఉందని అశోక గజపతి రాజు అన్నారు.

చాలా పేర్లు వస్తాయి: జానా
రాష్ట్ర విభజనకు కారకులు ఎవరు... అనే చర్చకు వస్తే చాలా పేర్లు వస్తాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి అన్నారు. సభలో నియమ నిబంధనలు ఉన్నాయని, పరుష పదాలు వాడవద్దన్నారు. ఎనిమిది కోట్ల మంది ప్రజల అభిప్రాయం సభలో చెప్పుకోవచ్చన్నారు. సోనియా పేరు చెప్పడాన్ని టిడిపి ఉపసంహరించుకోవాలన్నారు. చంద్రబాబు కూడా లేఖ ఇచ్చారన్నారు.
సోనియా కారణమని సంబరాలు చేసుకోలేదా?: పల్లె
జానా వ్యాఖ్యలపై పల్లె రఘునాథ్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ రావడానికి సోనియా కారణమని తెలంగాణ కాంగ్రెసు నేతలు సంబరాలు చేసుకోలేదా చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణకు సోనియా కారణం కాదని జానా చెబితే తాను తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటానని చెప్పారు.
దానికి జానా రెడ్డి స్పందిస్తూ.. తెలంగాణ తమ పార్టీ నిర్ణయమని, దానికి సోనియా గాంధీ అధ్యక్షురాలు అన్నారు.












Click it and Unblock the Notifications