అప్పుడు ఏం చేసారు - తిరుమల లడ్డూ వివాదంపై షర్మిల వ్యాఖ్యలు..!!
తిరుమల లడ్డూ వివాదం పై రాజకీయ చర్చ కొనసాగుతోంది. తాజాగా లడ్డుకు వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని తాజా లాబ్ నివేదిక బయటకు వచ్చింది. దీంతో, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం పైన సీబీఐ విచారణ చేయాలని వైసీపీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. పీసీసీ చీఫ్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేసారు. విచారణ చేయాలని డిమాండ్ చేసారు.
పవిత్రమైన తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు వాడటం చిన్న విషయం కాదని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. ఇంత పెద్ద విషయాన్ని చంద్రబాబు అంత ఈజీగా ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. 100 రోజుల ముందే తెలిస్తే.. అప్పుడే ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. లడ్డూ వివాదం పై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుందని.. సీబీఐ విచారణ కోరుతూ హోంశాఖకు లేఖ రాసారు. లడ్డూ వివాదం పై ప్రధాని, హోంమంత్రి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా వాడుకోవడానికే ఇప్పుడు బయట పెట్టారా అంటూ వ్యాఖ్యానించారు. సీబీఐ ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవ్వరూ చేశారనే విషయం బయటికీ రాదని పేర్కొన్నారు. ఒకవేళ నిజంగానే తప్పు జరిగితే.. వాళ్ల మీద యాక్షన్ తీసుకోవాలిని డిమాండ్ చేసారు. లేకుంటే మళ్లీ ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం షర్మిల వ్యాఖ్యానించారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications