సబ్ కలెక్టర్ ఆఫీసు అగ్నిప్రమాదం, పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు అందర్, స్కెచ్ వేసింది?
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం కేసులో వైసీపీ నాయకులకు ఊహించని షాక్ ఇచ్చారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు మాజీ మంత్రి, పుంగనూరు నియోజక వర్గం వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రధాన అనుచరుడు, వైసీపీ నాయకుడిని అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె (ఉమ్మడి చిత్తూరు జిల్లా)లోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి 11.24 గంటల సమయంలో మంటలు వ్యాపించిన విషయం తెలిసింది. సబ్ కలెక్టర్ కార్యాలయలంలో కుప్పం, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, పీలేరు, తంబళ్లపల్లె అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన కీలక ఫైళ్లు ఉన్నాయి. అయితే అగ్నిప్రమాదంలో 25 కీలక ఫైళ్లు కాలి బూడిద అయ్యాయని పోలీసు అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు అంటున్నారు.

డీజీపీ ద్వారకా తిరుమలరావు స్వయంగా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం చేరుకుని సుమారు మూడు గంటల పాటు విచారణ జరిపి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. 10 ప్రత్కేక టీమ్ లు ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్నిప్రమాదం కేసులో అందరూ అనుకున్నట్లే వైసీపీ నాయకుల ప్రమేయం ఉందని స్పష్టంగా వెలుగు చూడటం కలకలం రేపుతోంది.
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, పుంగనూరు నియోజక వర్గం వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రధాన అనుచరుడు, వైసీపీ నాయకుడు మాదవ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అగ్నిప్రమాదం జరగడానికి పది రోజుల ముందు నుంచి ప్రతిరోజు క్రమం తప్పకుండా మదవ రెడ్డి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వెళ్లాడని పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది.

పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అనుచరుడు మాదవ రెడ్డి పది రోజుల పాటు వరుసగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి ఎందుకు వచ్చాడు, అతనికి ఆ కార్యాలయంలో ఏం పని, ఏ ఫైళ్లకు సంబందించి అధికారులు ఎవరెవరిని కలిశారు అని మాదవ రెడ్డి నుంచి పోలీసులు వివరాలు బయటకులాగుతున్నారు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్నిప్రమాదం జరిగి అక్కడ ఫైల్స్ దహనం అయిన కేసులో మాదవ రెడ్డి హస్తం ఉందని నిర్దారించుకున్న పోలీసు అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
అయితే ఇంకా ఎంతమంది ప్రమేయం ఉంది అనే విషయంలో ఎలాంటి సమాచారం బయటకురాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పోలీసు అధికారులు లోలోప అందిరి సమాచారం తెలుసుకుని అందరిని ఎత్తిలోపల వెయ్యాలని డిసైడ్ అయ్యారని తెలిసింది. ఇక మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం కేసు విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయిన విషయం తెలిసిందే.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications