చంద్రబాబుకు సినిమా చూపించిన పెద్దిరెడ్డి, రివర్స్ లో త్రీడి సినిమా చూపిస్తున్న సీఎం బాబు
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది పెద్దిరెడ్డి అడ్డా అయిన పులిచెర్లలో వైసీపీ నాయకులు సామూహిక రాజీనామాలు చేశారు. జడ్పీటీసీ, సర్పంచ్ లు, వైస్ ఎంపీపీలు ఒకేసారి రాజీనామా చెయ్యడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వర్గీయులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సొంత నియోజక వర్గం పుంగనూరు మునిసిపాలిటీ ఛైర్మన్ తో సహ 13 మంది కౌన్సిలర్లు ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు. పెద్దిరెడ్డి అడ్డా పుంగనూరులోనే వైసీపీని చావుదెబ్బ కొట్టిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే నియోజక వర్గం మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఈ దెబ్బకు పుంగనూరు నియోజక వర్గంలోని పులిచెర్ల మండలం జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ తో పాటు పది మందికి పైగా ప్రజాప్రతినిధులు వారి పదవులకు, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

చిత్తూరు చేరుకున్న వైసీపీ జెడ్పీటీసీ సభ్యుడు మళీధర్ ఆయన రాజీనామా లేఖను జెడ్పీ సీఈవో గ్లోరియాకు అందివ్వాలని ప్రయత్నించారు. అయితే జెడ్పీ సీఈవో గ్లోరియా అందుబాటులో లేకపోవడంతో నేరుగా కలెక్టరేట్ చేరుకున్న మురళీధర్ జేపీ శ్రీనివాసులకు ఆయన రాజీనామా లేఖను అందించారు. అనంతరం జెడ్పీటీసీ మరుళీధర్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితో పాటు వైసీపీ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.
మమ్మల్ని నమ్ముకుని ఇంతకాలం మా వెంట నిలిచిన వైసీపీ కార్యకర్తలు కష్టాల్లో ఉన్న సమయంలో పెద్దిరెడ్డితో పాటు వైసీపీ నాయకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, అందుకే ఆ పార్టీ తీరుతో విసిగిపోయి తన పదవికి రాజీనామా చేశానని జెడ్పీటీసీ మురళీధర్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో స్థానిక సంస్థలన్ని నిర్వీర్యం చేశారని, పెత్తనం మొత్తం పెద్దాయన చేతిలోనే ఉందని జెడ్పీటీసీ మురళీధర్ ఆరోపించారు.

పేరుకు మాత్రమే తాము ఇంతకాలం పదవుల్లో ఉన్నామని, ప్రజలకు, కార్యకర్తలకు న్యాయం చెయ్యలేకపోయామని జెడ్పీటీసీ మురళీధర్ విచారం వ్యక్తం చేశారు.జెడ్పీటీసీ మురళీధర్ తో పాటు పుంగనూరు నియోజక వర్గానికి చెందిన సర్పంచ్ లు అనిత, వెంకటేష్, రాణెమ్మ, ఉషారాణి, సరస్వతి, షకూర్, వైఎస్ ఎంపీపీలు ఈశ్వరి గోవర్దన్, రాశి ప్రసాద్ లు వారి పదవులుకు రాజీనామా చేశారు.
రాజీనామాలు చేసిన ఈ పది మంది నాయకులు తాము టీడీపీలో చేరుతున్నామని మాత్రం చెప్పకుండా భవిష్యత్తు నిర్ణయం త్వరలో ప్రకటిస్తామని చెబుతున్నారు. గతంలో కుప్పం మునిసిపాలిటీని వైసీపీ ఖాతాలోకి వేసిన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చంద్రబాబుకు సినిమా చూపిస్తామని అన్నారు. అయితే చంద్రబాబు సీఎం అయిన తరువాత ఇప్పుడు అదే పెద్దిరెడ్డికి రివర్స్ లో త్రీడి సినిమా చూపించడానికి సిద్దం కావడం పుంగనూరుతో పాటు చిత్తూరు జిల్లాలో హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications