మహిళల్ని వేధిస్తే ఉరిశిక్ష!: మంత్రి పీతల సుజాత
హైదరాబాద్: మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే నిందితులకు ఫోక్స్ చట్టం కింద ఉరిశిక్ష విధించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత శనివారం నాడు హెచ్చరించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆమె మాట్లాడారు.
ఆమె కడప జిల్లాకు తిరిగి వెళ్తూ మార్గమధ్యంలో ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం వెంగారెడ్డిపాళెం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి చిన్నారులతో కొద్దిసేపు ముచ్చటించారు. చిన్నారులకు పలకలు పంపిణీ చేశారు.

గతంలో పంపిణీ చేస్తున్న బాలామృతంకు బదులు బియ్యం, కందిపప్పు అందజేస్తున్నట్లు చెప్పారు. బాలామృతం తయారుచేసే కర్మాగారం రాష్ట్ర విభజన నేపథ్యంతో తెలంగాణాకు వెళ్లిపోయిన దృష్ట్యా ప్రత్యామ్నాయంగా బియ్యం, కందిపప్పు ఇస్తున్నట్లు వివరించారు.












Click it and Unblock the Notifications