చంద్రబాబు సొంత జిల్లాలో ఇలాంటి ఇబ్బందులు, కుప్పంలో దర్జాగా పనికిరాని ఇసుకతో?
ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఇసుక విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కొత్త ఇసుక విధానాన్ని అమలు చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సీనరేజ్, ఇసుక తవ్వకాలకు మాత్రమే నామమాత్రంగా తక్కువ డబ్బులు వసూలు చేస్తూ సామాన్య ప్రజలకు ఇసుకను అందిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో ఇసుకకు డిమాండ్ ఎక్కువ అయ్యింది. చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం తో పాటు పలమనేరు, పుంగనూరు అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో ఇసుకకు చాలా డిమాండ్ ఏర్పడింది. చిత్తూరు జిల్లాలో కేవలం రెండు ఇసుక స్టాక్ పాయింట్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో రెండు ఇసుక పాయింట్లు అందుబాటులో ఉండటంతో ఇతర ప్రాంతాల్లోని ప్రజలకు సరైన సమయంలో ఇసుక అందుబాటులో లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో సరైన సమయంలో ఇసుక అందక సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో మరో ఇసుక స్టాక్ నాయింట్ అందుబాటులోకి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రజల అభిప్రాయం చేస్తున్నారు. జూలై 8వ తేదీ నుండి చిత్తూరు జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలులోకి వచ్చింది. చిత్తూరు మండలంలోని దిగువమాసాపల్లి, పాలూరు ప్రాంతాల్లో, గంగవరం మండలంలోని బైరెడ్డిపల్లి క్రాస్ వద్ద ఇసుక పాయింట్లు ఏర్పాటు చేశారు.
చిత్తూరు జిల్లాలోని రెండు ఇసుక డిపోలో టన్నుకు రూ. 150 మాత్రమే వసూలు చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా రూ. 770 రూపాయలు చెల్లిస్తే ఒక ట్రాక్టర్ ఇసుక తీసుకుని వెళ్లవచ్చని సంబందిత అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఒకవేళ ఇసుకను తీసుకువెళ్లడానికి సొంత వాహనాలు లేకుంటే ఇసుక రవాణా చేయడానికి అదనంగా డబ్బులు చెల్లించాలని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం పాలూరు దిగువమాసా పల్లెలో స్టాక్ పాయింట్లు మాత్రమే ఇసుక తీసుకోవడానికి అవకాశం ఉంది.
బైరెడ్డిపల్లి క్రాస్ డిపో లో వారం రోజులకు ఇసుక పూర్తిగా ఖాళీ అయ్యింది. కుప్పంలో స్థానిక చెరువుల్లో మట్టిని టిసి కృత్తిమ ఇసుకను తయారుచేసి భారీ మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి నాణ్యతలేని ట్రాక్టర్ ఇసుక రూ. 4,000 నుంచి రూ. 5, 000 వసూలు చేసి ఆ ఇసుకను విక్రయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అక్రమ ఇసుక వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలంటే పలమనేరు, కుప్పం, పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గాల సమీపంలో మరో ఇసుక రీచ్ పాయింట్ ఏర్పాటు చేయాలని ప్రజల మనవి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications