విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'సిగ్నేచర్‌ టవర్స్‌ నిర్మిస్తాం': ఏపీ ఐటీ హబ్‌గా విశాఖ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఐటీ రంగంలో ఏపీ అగ్రస్థానంలో నిలుపుతామని సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘనాథరెడ్డి చెప్పారు. మంగళవారం ఆయన ఐటీ సలహాదారు జె సత్యనారాయణ, ఐటీ శాఖ కార్యదర్శి ఫణి కిశోర్‌, ఇన్నోవేషన్స సొసైటీస్‌ సీఈఓ నిఖిల్‌ అగర్వాల్‌, ఈ గవర్నెన్స అథారిటీ సీఈఓ రత్నాకర్‌ జౌహారిలతో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న తన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకూ 44 కంపెనీలకు అనుమతులు ఇవ్వడం ద్వారా ఏపీకి 5000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయన్నారు. విశాఖపట్నం, తిరుపతి నగరాలను ఐటిఐఆర్‌లుగా గుర్తిస్తే భవిష్యతలో ఐటి రంగం మరింతగా విస్తరిస్తుందని ఆయన తెలిపారు.

 ఏపీ ఐటీ హబ్‌గా విశాఖ: సమీక్షలో మంత్రి పల్లె

ఏపీ ఐటీ హబ్‌గా విశాఖ: సమీక్షలో మంత్రి పల్లె

ఏపీకి అతి పెద్ద బ్రాండ్ అంబాసిడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని మంత్రి అభివర్ణించారు. ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగం అభివృద్ధికి దేశంలోనే ఆంధ్రప్రదేశలో అపారమైన అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. విశాఖపట్నంలో ఇప్పటికే లక్షన్నర చదరపు అడుగుల ఇంక్యుబేషన్ సెంటర్‌‌ను ఏర్పాటు చేశామన్నారు.

 ఏపీ ఐటీ హబ్‌గా విశాఖ: సమీక్షలో మంత్రి పల్లె

ఏపీ ఐటీ హబ్‌గా విశాఖ: సమీక్షలో మంత్రి పల్లె

ఈ ఇంక్యుబేషన్ సెంటర్‌లో విప్రో, టెక్‌ మహీంద్రా సంస్థలు తమ తమ కార్యకలాపాలను ప్రారంభించాయన్నారు. దీనికి అదనంగా మరో 20 లక్షల చదరపు అడుగుల్లో రెండు దశల్లో సిగ్నేచర్‌ టవర్స్‌ నిర్మిస్తామని ఆయన చెప్పారు. వైజాగ్‌లోనే 4 ఎకరాల్లో 3 లక్షల చదరపు అడుగులతో మరో 190 కోట్ల వ్యయంతో మిలీనియం టవర్స్‌ను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు.

 ఏపీ ఐటీ హబ్‌గా విశాఖ: సమీక్షలో మంత్రి పల్లె

ఏపీ ఐటీ హబ్‌గా విశాఖ: సమీక్షలో మంత్రి పల్లె

ప్రస్తుతం సెజ్‌ పరిధిలో ఉన్న హిల్‌-2 ప్రాంతాన్ని డీనోటిఫై చేయడానికి హైపవర్‌ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. దీన్ని కేంద్రానికి పంపి త్వరలోనే డీనోటిఫై కావడానికి అనుమతులు పొందుతామన్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయితే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్‌కు ఐటి హబ్‌గా రూపాంతరం చెందుతుందన్నారు.

 ఏపీ ఐటీ హబ్‌గా విశాఖ: సమీక్షలో మంత్రి పల్లె

ఏపీ ఐటీ హబ్‌గా విశాఖ: సమీక్షలో మంత్రి పల్లె

విశాఖపట్నంలో 8 కోట్ల రూపాయల వ్యయంతో మిచిగాన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటి) ఫ్యాబ్‌ లాబ్‌ను ఏర్పాటు చేస్తోందని ఆయన వివరించారు. రాజధాని నగర అభివృద్ది ప్రాంతంలో ఐటి పార్క్‌ నిర్మాణం కోసం 1000 ఎకరాలు కావాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు.

English summary
Permission given to 44 IT firms: Minister Palle Raghunatha Reddy .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X