ఇక్కడే: ఏపీలో మూడు కొత్త విమానాశ్రయాలకు అనుమతి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నిర్మించతలపెట్టిన పలు విమానాశ్రయాలకు అనుమతులు లభించాయి. ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న భోగాపురం, కర్నూలు, నెల్లూరు విమానాశ్రయాలకు పూర్తి అనుమతులు లభించాయి.
ఢిల్లీలో సోమవారం జరిగిన పౌరవినమానయాన శాఖ ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎయిర్ పోర్టుల నిర్మాణానికి బిడ్డింగ్ దాఖలు చేయడానికి మార్గం సుగమం అయింది.

కాగా, తెలంగాణలోని ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో విమానాలు దిగేందుకు అవసరమైన తొలి అనుమతులు కూడా ఈ సందర్భంగా మంజూరు చేశారు.












Click it and Unblock the Notifications