ఒకే ఫ్రేమ్ లో.. ఫైర్ బ్రాండ్స్

Vallabhaneni Vamsi: ఇటీవలే జైలు నుంచి విడుదల అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వల్లభనేని వంశీని మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని పరామర్శించారు. కొద్దిసేపటి కిందటే వాళ్లిద్దరూ గన్నవరంలోని వంశీ ఇంటికి వచ్చారు. ఆయనను పరామర్శించారు.

ఆ సమయంలో వారి వెంట వైఎస్ఆర్సీపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. జైలు నుంచి విడుదలైన తరువాత వంశీని పేర్నినాని కలవటం ఇది రెండోసారి. బెయిల్ పై విడుదలైన మరుసటి రోజే నాని ఆయనను కలిశారు. యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. తాజాగా ఇప్పుడు మరోసాని కొడాలి నానితో కలిసి వంశీ ఇంటిని కలిశారు.

Perni Nani and Kodali Nani meets Vallabhaneni Vamsi

వంశీపై నమోదైన కేసులన్నింట్లోనూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇటీవలే బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అక్రమ మైనింగ్ కేసులో వంశీకి ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని తప్పుపడుతూ చంద్రబాబు ప్రభుత్వం సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది. అనంతరం హైకోర్టు తీర్పును సమర్థించింది. చంద్రబాబు ప్రభుత్వం కోరుకున్నట్టుగా బెయిల్ రద్దు చేయడానికి అంగీకరించలేదు.

137 రోజుల తరువాత వంశీ విడుదల అయ్యారు. ఆ వెంటనే ఆయన.. తాడేపల్లిలో పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని కలిశారు. ఆయనకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. కష్టకాలంలో అండగా నిలిచినందుకు జగన్ కు వంశీ దంపతులు ధన్యవాదాలు తెలియజేశారు.

కాగా- అంతకుముందు పేర్ని నాని.. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

గుంటూరు జిల్లా మన్నవ గ్రామ సర్పంచ్‌ నాగమల్లేశ్వర రావుపై పట్టపగలు నడిరోడ్డుపై టీడీపీ నాయకులు అత్యంత కిరాతకంగా చేసిన దాడిని చూసి మొత్తం రాష్ట్రం అంతా ఉలిక్కిపడిందని అన్నారు. తెలుగుదేశం ఇలా రక్తపాతం సృష్టిస్తుంటే, కూటమి నేతలు వారిని ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్రాన్ని నరకాసుర రాజ్యంగా మారుస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎక్క‌డ చూసినా కూటమి నేతల రౌడీయిజం, గుండాగిరీతో అరాచక పాలన కనిపిస్తోందని పేర్ని నాని ప్రెస్ మీట్ లో ధ్వజమెత్తారు. మ‌హిళ‌ల‌కు, బాలిక‌ల‌కు కూడా ర‌క్ష‌ణ ఉండ‌ట్లేదని, శాంతిభ‌ద్ర‌త‌ల‌ను కాపాడాల్సిన పోలీసులు టీడీపీ నాయ‌కుల దారుణాల‌కు, ఆగ‌డాల‌కు అండ‌గా నిల‌బడి ప్రోత్స‌హిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌శ్నిస్తే వాటికి స‌మాధానం చెప్పుకోలేక అధికారంలో ఉన్నామనే ధీమాతో వైఎస్ జ‌గ‌న్‌ ను భూస్థాపితం చేస్తాన‌ని చంద్రబాబు బెదిరింపుల‌కు దిగుతున్నాడని పేర్నినాని విమర్శించారు. సంక్రాతి నాటికి రోడ్ల మీద గోతులు పూడుస్తామ‌ని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఆరు నెల‌లు దాటినా దానికి అతీగ‌తీ లేదని విమర్శించారు. ఏడాది కూట‌మి పాల‌న‌లో వ్య‌వ‌స్థ‌ల‌న్నీ నిర్వీర్యం అయిపోయాయని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+