నారా దేవాన్ష్‌కు 4 ప్లస్ 4 గన్‌మెన్‌లు..టీడీపీకి వైసీపీ కౌంటర్
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. మాజీ సీఎం జగన్ ఇంటిపై టీడీపీ నేతలు చేస్తోన్న ఆరోపణలపై ఆయన స్పందించారు. బెంగళూరులోని మాజీ సీఎం జగన్ ఇంటితో పాటు హైదరాబాద్‌లో ఉన్న సీఎం చంద్రబాబు ఇంటిని కూడా హోం టూర్ చేయాలని టీడీపీ నేతలకు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ విసిరారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగి ఉంటే రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఆడిట్ జరపాలని డిమాండ్ చేశారు.
అన్ని అనుమతులు తీసుకునే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మించామని ఆయన తెలిపారు తాడేపల్లి ఆఫీసులో ఉన్న ఫర్నిచర్ తీసుకెళ్లమంటే వారే తీసుకెళ్లడం లేదన్నారు. ఒక వేళ ఫర్నిచర్‌కు డబ్బులు కట్టమంటే తామే కట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపినా ప్రభుత్వం ముందుకు రావడం లేదని.. కావాలనే దీనిపై టీడీపీ రాద్దంతం చేస్తోందని ఆయన విమర్శించారు. ఇక జగన్ సెక్యూరిటీపై ఆయన స్పందించారు. జగన్‌కు సెక్యూరిటీగా 986 మంది ఉన్నారంటూ టీడీపీ నేతలు చేసిన ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని ఆయన తెలిపారు.

2014-2019లో టీడీపీ అధికారంలో ఉన్న నాడు సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్‌కు 4 ప్లస్ 4 గన్‌మెన్‌లు ఇచ్చారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.కొందరు పనిగట్టుకుని జగన్ భద్రతపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్‌కు సెక్యూరిటీగా ఉన్నది 196 మంది మాత్రమేనని పేర్ని నాని క్లారిటీ ఇచ్చారు.హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో అక్రమణలు జరిగితే ఆ విషయంలో జగన్‌కు ఉన్న సంబంధం ఏంటో టీడీపీ నేతలు చెప్పాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. జగన్ సీఎంగా ఉన్నప్పడు తాత్కాలిక పోలీస్ పోస్ట్ ఏర్పాటు చేశారని, ఇప్పుడు దానిని తొలగించడం ఆక్రమణ కిందకు వస్తుందా అని టీడీపీ నాయకులను పేర్ని నాని ప్రశ్నించారు.జగన్‌పై విష ప్రచారాన్ని ఆపి ..ఇచ్చిన హామీలను అమలు చేయాలని పేర్ని నాని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications