ఆత్మహత్య: భార్యకు చెప్పి టెక్కీ ఊరేసుకున్నాడు

గదిలోకి వెళ్లి అతను తలుపులు కూడా వేసుకోలేదు. బెడ్ షీట్‌తో ఉరివేసుకున్నాడు. మృతుడిని సునీల్ కుమార్‌గా గుర్తించారు. అతను గచ్చిబౌలిలోని విప్రోలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. సునీల్ ఏడాది క్రితం శ్యామలదేవిని వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి దంపతులు కెపిహెచ్‌బిలో ఉంటున్నారు.
బుధవారం ఉదయం సునీల్ భార్యతో గొడవ పడ్డాడని, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఇరుగుపొరుగువారి సాయంతో శ్యామల తన భర్తను కిందికి దింపి, ఆస్పత్రికి తరలించింది.
అయితే, అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు. సూసైడ్ నోట్ ఏదీ రాయలేదని, వ్యక్తిగతమైన ఇబ్బందుల కారణంగానే అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అంటున్నారు.